HOME »NEWS »MOVIE »priyanka chopra look in met gala 2019 is hot topic of memes for social media ta 2

ఓ మై గాడ్.. ప్రియాంక చోప్రాకు ఏమైంది.. ఏమిటి అవతారం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్..

ఓ మై గాడ్.. ప్రియాంక చోప్రాకు ఏమైంది.. ఏమిటి అవతారం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్..
ప్రియాంక చోప్రా

మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా.. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన మెట్‌గాాల 2019 ఈవెంట్‌లో విచిత్ర వేషధారణలో తళుక్కున మెరిసి అభిమానుల ఆశ్చర్యచకితులను చేసింది.ఈ వేడుకలో ఆమె హెయిర్ స్టైల్, లుక్ చూసి అభిమానులందరు నోరెళ్ల బెట్టారు. అంతేకాదు ఆమె విచిత్ర వేషధారణపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి.

  • Share this:
    మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా.. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన మెట్‌గాాల 2019 ఈవెంట్‌లో విచిత్ర వేషధారణలో తళుక్కున మెరిసి అభిమానుల ఆశ్చర్యచకితులను చేసింది. ఈ వేడుకలో ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో  మెరిసింది. ఇక ఈ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రాను చూసిన వారు ముందుగా ప్రియాంకనో కాదో తేల్చకోవడానికి సమయం పట్టింది. ఈ వేడుకలో ఆమె హెయిర్ స్టైల్, లుక్ చూసి అభిమానులందరు నోరెళ్ల బెట్టారు. ఇక మెట్‌గాలా ఈవెంట్‌ విషయానికొస్తే ఈ వేడుకకు ఒక  ప్రత్యేకత ఉంది. రెండేళ్ల క్రితం న్యూయార్క్‌లో జరిగిన ఈ ఫంక్షన్‌లోనే  ప్రియాంక, నిక్ జోనస్ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రణయంగా మారి వాళ్ల పరిణయానికి దారి తీసింది. తాజాగా జరిగిన ఈ మెట్‌గాలా 2019 ఈవెంట్‌లో ప్రియాంక హెయిర్ స్టైల్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది.



    ప్రతి యేడాది న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతి యేడాది ‘మెట్‌గాలా’ కార్యక్రమం నిర్వహిస్తుూ వస్తున్నారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లోని సెలబ్రిటీలు చిత్ర విచిత్ర వేషధారణలో హాజరవుతుంటారు. ఇందులో భాగంగా ప్రియాంక చోప్రా ..ఇప్పటి వరకు ఎవరు చూడనటు వంటి వింత వేషధారణలో ఈ ఈవెంట్‌లో సందడి చేసి నెటిజన్స్ ట్రోల‌్‌కు గురైయింది. కొంత మంది ప్రియాంక చోప్రాకు ఏమైనా కరెంట్ షాక్ కొట్టిందా అందుకే ఆమె జుట్టు అలా తయారైందా అనే అనుమానాలు వ్యక్తం చేసారు.



    మరికొందరు వీరప్పన్‌తో ప్రియాంక చోప్రా ఫోటోను షేర్ చేస్తూ ట్రోల్ చేసారు. మరికొందరు తమిళ స్టార్  కమెడియన్ యోగిబాబు హెయిర్ స్టైల్‌లా ప్రియాంక చోప్రా తలకట్టు ఉందని వ్యాఖ్యానించారు. ఇలా ఒక్కో నెటిజన్ ఒక్కోరకంగా వ్యాఖ్యానిస్తూ ప్రియాంక చోప్రా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ప్రియాంక చోప్రాపై నెటిజన్లు చేస్తోన్న ట్రోలింగ్‌ను ప్రియాంక అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.












    Published by:Kiran Kumar Thanjavur
    First published:May 07, 2019, 19:06 IST