కాబోయే భర్తకు ప్రియాంక చిరు కానుక

ఈ రోజు నిక్ జోనస్ బర్త్ డే సందర్బంగా ప్రియాంక చోప్రా..కాబోయే భర్త నిక్ జోనస్‌కు అద్భుతమైన బహుమతి ఇచ్చింది.

news18-telugu
Updated: September 17, 2018, 12:30 PM IST
కాబోయే భర్తకు ప్రియాంక చిరు కానుక
Priyanka Chopra Kisses would be Nick Jonas
news18-telugu
Updated: September 17, 2018, 12:30 PM IST
గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ గురించి వార్తలే వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో గత ఏడాది కాలంగా పీకలోతు ప్రేమలో మునిగితేలిన ప్రియాంకా ...ఎట్టకేలకు తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ప్రియాంక, నిక్‌ల నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీళ్లిద్దరు మూడు ముళ్లతో ఒక్కటి కానున్నారు.ఈ రోజు నిక్ జోనస్ బర్త్ డే సందర్బంగా ప్రియాంక చోప్రా..కాబోయే భర్త నిక్ జోనస్‌కు అద్భుతమైన బహుమతి ఇచ్చింది. ఇంతకీ ఏ బహుమతి ఇచ్చిందో తెలుసా ఫస్ట్ టైమ్ పబ్లిక్‌గా తన ప్రియుడిని లిప్ కిస్ చేసింది. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణితి చోప్రా..తన కాబోయే బావగారైన నిక్ జోనస్‌కు ట్విట్టర్ సాక్షిగా బర్త్ డే విషెస్ చెప్పింది.
Loading...

First published: September 17, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...