ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనాస్‌పై మండిపడుతున్న నెటిజన్స్

Priyanka Chopra : ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్. ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 13, 2019, 11:53 AM IST
ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనాస్‌పై మండిపడుతున్న నెటిజన్స్
Twitter/nickjonas
news18-telugu
Updated: September 13, 2019, 11:53 AM IST
ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్. దీంతో ఆమె ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. ప్రియాంక.. ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంక మరింత పాపులర్ అయింది. దీనికి తోడు ప్రియాంక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఆమె భర్త నిక్ కూడా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో తన ప్రాజెక్ట్స్ గురించి ప్రస్థావిస్తూ.. పోస్ట్‌లు చేస్తుంటాడు. ఈ ఇద్దరూ  ఏ చిన్న పోస్ట్ చేసినా, ఫోటో పెట్టినా.. క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ప్రియాంక ఎక్కడా.. పార్టీలకు వెళ్లినా, బీచ్‌లకు వెళ్లినా, విహార యాత్రలకు వెళ్లినా.. అక్కడ దిగిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అయితే  వీరు షేర్‌ చేసిన ఫొటోలపై అభిమానుల నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. తాజాగా కొంతమంది ప్రియాంక అభిమానులు, నెటిజన్ల నిక్‌ జోనస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ ఫొటోపై  విమర్శిస్తున్నారు.


వివరాల్లోకి వెళితే.. ఇటీవల నిక్‌ జోనాస్ సిగార్ అఫిసియనాడో అనే ఆంగ్ల పత్రిక కవర్‌ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫోటో షూట్‌లో నిక్ సిగార్ కాల్చుతూ.. పోజులిచ్చారు. దానికి సంబందించిన కొన్ని ఫోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. తన అభిమానులతో పంచుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న... ఆ  ఫొటోలను చూసిన నెటిజన్స్ నిక్‌పై విమర్శలు చేస్తున్నారు. నిక్ మీరంటే మాకు చాలా ఇష్టం.. కాని.. స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం..  ధూమపానం చేయోద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు నెటిజన్లు కాస్తా ముందుకెళ్లి.. ‘నిక్.. ప్రియాంకకు ఆస్తమా ఉంది కదా... ఇలా మీరు స్మోక్ చేస్తే .. అది ఆమె ఆరోగ్యానికి ప్రమాదం అవుతుంది..అంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.



 
First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...