ప్రియాంక చోప్రా చేసిన పనికి ఫిదా అయిన భర్త నిక్ జోనస్..

నిక్ జోనస్‌.. ప్రియాంక గురించి తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ఆసక్తికర సందేశం పోస్ట్ చేశాడు,నా భార్య ఇండియన్. ఆమె హిందువు. అంతేకాదు అన్నింటిలోనూ ఆమె అసమానురాలు. ఆమె సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆమెను నేనెంతో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మేమిద్దం ఎంతో సరదాగా జీవితాన్ని గడుపుతున్నాం. అందరికీ కార్వా చౌత్‌ శుభాకాంక్షలు అని పేర్కొన్నాడు నిక్ జోనస్

news18-telugu
Updated: October 23, 2019, 10:49 AM IST
ప్రియాంక చోప్రా చేసిన పనికి ఫిదా అయిన భర్త నిక్ జోనస్..
ప్రియాంక చోప్రా నిక్ జోనస్ కర్వాచౌత్
  • Share this:
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పెళ్లి బాలీవుడ్‌లోనే అతిపెద్ద ఈవెంట్‌గా జరిగింది. ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అమెరికాలోనే సెటిలై భర్తతో జాలీగా గడుపుతోంది ప్రియాంక. కాగా తాజాగా ఆమె భర్త నిక్ జోనస్‌.. ప్రియాంక గురించి తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ఆసక్తికర సందేశం పోస్ట్ చేశాడు. వివరాలలోకి వెళితే .. ప్రియాంక భర్త నిక్ జోనస్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కార్వా చౌత్ శుభాకాంక్షలు తెలుపుతూ తన భార్యతో కలిసి దిగిన పిక్ షేర్ చేశాడు.ఉత్తర భారత దేశంలో కార్వా చౌత్ అనే పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి ముందు వచ్చే చవితి ముందురోజు తదియ రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఇక్కడ అట్ల తద్దెగా మనవాళ్లు చేసుకుంటారు. 

View this post on Instagram
 

My wife is Indian. She is Hindu, and she is incredible in every way. She has taught me so much about her culture and religion. I love and admire her so much, and as you can see we have fun together. Happy Karva Chauth to everyone!


A post shared by Nick Jonas (@nickjonas) on

భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తుంటారు అక్కడి ఆడవాళ్లు. ఇదే ఈ పండుగ స్పెషాలిటీ. ప్రియాంక చోప్రా కూడా తన భర్త కోసం ఇలా ఉపవాస దీక్ష చేసిందట.''నా భార్య ఇండియన్. ఆమె హిందువు. అంతేకాదు అన్నింటిలోనూ ఆమె అసమానురాలు. ఆమె సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆమెను నేనెంతో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మేమిద్దం ఎంతో సరదాగా జీవితాన్ని గడుపుతున్నాం. అందరికీ కార్వా చౌత్‌ శుభాకాంక్షలు'' అని పేర్కొన్నాడు నిక్ జోనస్.
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>