ఇపుడున్న హీరోయిన్స్‌లో ప్రియాంక చోప్రా టైం మాములుగా లేదు. ఎక్కడ లెగ్ పెడితే అక్కడ సూపర్ సక్సెస్ అయితోంది. హాలీవుడ్ల క్వాంటికో సిరీస్ జేస్తే...అది హిట్టైయింది. అంతకు ముందు ‘ఫ్యాషన్’ సినిమాలో నటనకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఆ తర్వాత హాలీవుడ్లో ‘‘బేవాచ్’’మూవీలో యాక్ట్ చేసి నటిగా సత్తా చాటింది. అంతేకాదు కేంద్రం నుంచి పద్మశ్రీ గౌరవాన్ని అందుకుంది. అంతేకాదు టైమ్ మ్యాగజైన్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా ప్రియాంక చోప్రాకు ఐక్యరాజ్య సమితి.. యూనిసెఫ్ అమెరికా డానీ కేయి మానవతా పురస్కారానికి ఎంపికైంది. బాలల విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందుకు ప్రియాంకకు ఈ అవార్డు ప్రకటించారు. ఈ యేడాది చివర్లో ఆమెకు ఈ అవార్డు ప్రధానం చేయనున్నారు.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితికి చెందిన ‘గర్ల్ అప్’ అనే ప్రచారంలో భాగంగా మన దేశంలో చిన్నారుల చదువుతో పాటు, ఆరోగ్యం, రక్షణపై వివిధ ఎన్జీవోలతో ఆమె సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తనకు ఐక్యరాజ్య సమితి ఈ అవార్డు ప్రకటించినందుకు ప్రియాంక ట్విట్టర్లో యూనిసెఫ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 13, 2019, 09:06 IST