• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRIYANKA CHOPRA HAS SHARED SEVERAL FAN MADE MEMES ON ONE OF HER LOOKS EVEN VIRAT KOHLI IS A PART OF THEM SRD

Priyanka Chopra : బంతి లాంటి డ్రెస్ పై ఫన్నీ మీమ్స్..కోహ్లీని కూడా వదల్లేదు..ప్రియాంక రియాక్షన్ ఏంటంటే..

Priyanka Chopra : బంతి లాంటి డ్రెస్ పై ఫన్నీ మీమ్స్..కోహ్లీని కూడా వదల్లేదు..ప్రియాంక రియాక్షన్ ఏంటంటే..

ప్రియాంక చోప్రా (Photo credit : Twitter)

Priyanka Chopra : ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏ విషయమైనా వెరైటీగా కన్పిస్తే చాలు.. ఇక మీమ్స్ రెడీ అయినట్టే. సరదాగా నవ్వు పట్టించేలా ఉంటాయ్ మీమ్స్. ఇక సెలబ్రెటీలపై మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు ఏ మాత్రం విభిన్నంగా కన్పించినా ఇక ఫన్నీ మీమ్స్ పుట్టుకొస్తాయ్.

  • Share this:
    ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏ విషయమైనా వెరైటీగా కన్పిస్తే చాలు.. ఇక మీమ్స్ రెడీ అయినట్టే. సరదాగా నవ్వు పట్టించేలా ఉంటాయ్ మీమ్స్. ఇక సెలబ్రెటీలపై మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు ఏ మాత్రం విభిన్నంగా కన్పించినా ఇక ఫన్నీ మీమ్స్ పుట్టుకొస్తాయ్. ట్రోలింగ్ కు మీమ్స్ కు చిన్నపాటి డిఫరెంట్ ఉందనే చెప్పాలి. మీమ్స్ చాలా వరకు సరదాగా నవ్వుకునే విధంగా ఉంటాయి. ట్రోలింగ్స్ మాత్రం ఎంతో అసహనానికి గురి చేస్తాయి. ఇక ప్రియాంకా చోప్రా కూడా ఆమెపై వచ్చిన మీమ్స్ ను చాలా సరదాగా తీసుకుంది. ఇక సూపర్ స్టార్ అయిన ప్రియాంకా చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన మకాం అమెరికాకి మార్చుకున్నప్పటికీ ఫ్యాన్స్ ను మాత్రం ఆమె నిరాశపర్చదు. అందుకే తన యాక్టివీటిస్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఇక ప్రియాంక షేర్ చేసే ఫోటోలు అయితే తెగ వైరల్ అవుతూనే ఉంటాయ్. ఈ ముద్దుగుమ్మ ఫొటో షూట్స్ చాలా వరకు డిఫరెంట్ ఉంటాయి. వరల్డ్ వైడ్ బెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ను ఆమె ఫాలో అవుతూనే ఉంటారు. ప్రియాంక ఎలాంటి కాస్ట్యూమ్ వేసినా కూడా అది నిమిషాల్లో వైరల్ అవ్వడం కామన్. కలలో కూడా ఊహించని డ్రెస్సులతో ఆమె ఒక్కోసారి షాక్ ఇస్తుంటుంది.

    ఇక ఈ సారి ప్రియాంక బంతి ఆకారంలో ఉన్న గుండ్రటి ఒక డ్రెస్ లో ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ప్రపంచంలో ఎవరు ట్రై చేయని విధంగా ఆమె ట్రై చేయడంతో ఆ ఫొటోలు నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఇక మీమర్స్ కు పని దొరకడంతో అనేక రకాల ఫొటోలు సైరల్ అయ్యాయి. ఇక ఆ మీమ్స్ ను చాలా సింపుల్ గా తీసుకున్న ప్రియాంక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.


    మీమ్స్ లో ఆటో హారన్ నుంచి.. పోకే మాన్ వరకు అన్ని రకాల మీమ్స్ తో హడావుడి చేసేశారు. ఇక ఆఖరికి విరాట్ కోహ్లీ కూడా క్రికెట్ బాల్ క్యాచ్ పడుతున్నట్లు ఉన్న ఫొటోలో ప్రియాంక డ్రెస్ ను జత చేశారు. ఈ మీమ్స్ పై ప్రియాంక చాలా పాజిటివ్ గానే స్పందించారు. నా రోజును హ్యాపీగా మార్చినందుకు థ్యాంక్స్ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
    Published by:Sridhar Reddy
    First published: