ప్రియాంక చోప్రా కాబోయే మామ దివాళా!

లేటెస్ట్‌గా ప్రియాంక చోప్రాకు కాబోయే మామగారైన నిక్ జోనస్ ఫాదర్..పాల్ జోనస్‌కు చెందిన ‘న్యూ జెర్సీ కన్‌స్ట్రక్షన్ & రియల్ ఎస్టేట్ కంపెనీ దివాళ తీసింది.

news18-telugu
Updated: September 3, 2018, 3:48 PM IST
ప్రియాంక చోప్రా కాబోయే మామ దివాళా!
కాబోయే భర్త, అత్తా మామలతో ప్రియాంక చోప్రా (ఫైల్ ఫోటో)
  • Share this:
అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో గత ఏడాది కాలంగా పీకలోతు ప్రేమలో మునిగితేలిన ప్రియాంకా ...ఎట్టకేలకు తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ప్రియాంక, నిక్‌ల నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీళ్లిద్దరు మూడు ముళ్లతో ఒక్కటి కానున్నారు.

యూఎస్‌కు చెందిన సింగర్ నిక్ జోనస్ ప్రియాంక కన్నా పదేళ్లు చిన్నవాడు. లేటెస్ట్‌గా ప్రియాంక చోప్రాకు కాబోయే మామగారైన నిక్ జోనస్ ఫాదర్..పాల్ జోనస్‌కు చెందిన ‘న్యూ జెర్సీ కన్‌స్ట్రక్షన్ & రియల్ ఎస్టేట్ కంపెనీ దివాళ తీసింది. అంతేకాదు అమెరికాకు చెందిన బ్యాంకులకు ఆయన కంపెనీ వన్ మిలియన్ అమెరికన్ డాలర్స్ పైగా బాకీ పడ్డారట.

ఈ సందర్భంగా పాల్ జోనస్‌కు చెందిన కంపెనీలు ఈ మొత్తాన్ని చెల్లించాలని అక్కడి న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. ఈ క్లిష్ట సమయాల్లో నిక్ జోనాస్‌తో ఆయన బ్రదర్స్ తన తండ్రి కంపెనీ బెయిల్ ఔట్ నుండి కాపాడే ప్రయత్నంలో వున్నారు. రీసెంట్ ఆగష్టు 18న జరిగిన ప్రియాంక, నిక్‌ల ఎంగేజ్మెంట్‌లో నిక్ తల్లి తండ్రులు సందడి చేసారు.

ఇవి కూడా చదవండి తైమూర్‌తో హాలీడేస్‌ను ఎంజాయ్ చేసిన సైఫ్, కరీనాలు

ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మున్నాభాయి..!

 
First published: September 3, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading