ప్రియాంక వ్యాపారం బాగు బాగు.. ఒక్కో సోషల్ మీడియా పోస్ట్‌కు..

Priyanka Chopra Jonas : భారతీయ అందం ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులరో తెలిసిందే.

news18-telugu
Updated: July 9, 2020, 9:34 AM IST
ప్రియాంక వ్యాపారం బాగు బాగు.. ఒక్కో సోషల్ మీడియా పోస్ట్‌కు..
ప్రియాంక చోప్రా Photo : Twitter
  • Share this:
Priyanka Chopra Jonas : భారతీయ అందం ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులరో తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను సంవత్సరం పాటు ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో కాపురం పెట్టింది. పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడు పాపులారిటీ మరింత పెరిగింది. అది అలా ఉంటే ఈ స్టార్స్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కొన్ని పేయిడ్ పోస్ట్‌లు చేస్తుంటారు. అయితే వీళ్లు పోస్ట్ చేసే ఒక్కో పోస్ట్ విలువ ఎంతో తెలిస్తే గుండే ఆగిపోయింది. అంతలా సంపాదిస్తున్నారు. సెలబ్రిటీలకు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ భారీ ధనార్జనకు రాజమార్గాలుగా మారాయి. ప్రియాంకచోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కపోస్ట్‌కు రెండుకోట్లకు పైగా చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంకకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదున్నర కోట్లకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. దీన్నే అదునుగా చూసుకుని పాపులర్ బ్రాండెడ్స్ తమ ఉత్పత్తులను సోషల్ మీడియాలో షేర్ చేయాలనీ ఒప్పందం కుదర్చుకుంటాయి.. అందులో భాగంగా ఈ ప్రియాంక అప్పుడపుడు కొన్ని ఉత్పత్తుల్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలా ఒక్క ప్రమోషనల్‌ పోస్ట్‌కు 2కోట్లు సంపాదిస్తూ భారత సినీతారల్లో మొదటిస్థానంలో నిలుస్తోంది మన గ్లోబల్ స్టార్. అంతేకాదు ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రపంచ సెలబ్రిటీల్లో 28వ స్థానంలో ఉంది. ఈ సంపాదనలో ఒకప్పటి రెజ్లింగ్ స్టార్ ఇప్పటి హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ ఒక్కపోస్ట్‌కు 8కోట్లు సంపాదిస్తూ ప్రపంచంలోనే సెలెబ్రీటిల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

ఇక ప్రియాంక సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె తాజాగా అమెజాన్ ప్రైమ్ తో ఆమె భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ ఒప్పందం విలువ కోట్లాది రూపాయల్లో ఉందని తెలుస్తోంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఓ కార్యక్రమాన్ని రూపొందించనుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. తాము నిర్మించే ఈ షోలతో మరింత భారతీయతను ప్రదర్శిస్తామని తెలిపింది. అంతేకాదు ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు లేకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే టాలెంట్‌కు ఇది ఒక ప్లాట్ ఫామ్ ఉండనుందని.. అదే తన కోరికని... అందుకే సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబల్ పిక్చర్స్ ను స్థాపించానని చెప్పింది ప్రియాంక. ఇక ప్రియాంక నటించిన రీసెంట్ హిందీ సినిమా ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రియాంక ప్రస్తుతం ‘వి కెన్‌ బి హీరోస్‌’, ‘ది మాట్రిక్స్‌ 4’, ‘ది వైట్‌ టైగర్‌’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ‘ది వైట్‌ టైగర్‌’‌ను నెట్‌ప్లెక్స్ సంస్ధ నిర్మిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: July 9, 2020, 9:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading