• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRIYANKA CHOPRA BECOME EMOTIONAL AFTER WATCHING THE SKY IS PINK IN TORONTO SR

కన్నీటి పర్యంతమైన ప్రియాంక చోప్రా.. గట్టిగా హత్తుకుంటూ..

కన్నీటి పర్యంతమైన ప్రియాంక చోప్రా.. గట్టిగా హత్తుకుంటూ..

Instagram/priyankachopra

Priyanka Chopra Jonas : ప్రియాంక చోప్రా ఇప్పుడో ఓ గ్లోబల్ స్టార్.. దీంతో ఆమె ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. 

  • Share this:
    ప్రియాంక చోప్రా ఇప్పుడో ఓ గ్లోబల్ స్టార్.. దీంతో ఆమె ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనాస్‌‌ను ఏడాది పాటు ప్రేమించి..  పెళ్లి చేసుకున్న ప్రియాంక ఇటు బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. ఆమె  దాదాపు మూడేళ్ల తర్వాత హిందీలో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే సినిమాలో నటించింది.  ఈ చిత్రంలో ప్రియాంకతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో డైరెక్టర్, నటుడు ఫర్హాన్‌ అక్తర్‌, నటి జైరా వాసిం నటించారు. సోనాలీ బోస్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓ వ్యక్తి రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల నేపథ్యంగా తెరకెక్కింది. సినిమా విషయానికి వస్తే.. చిన్నతనంతోనే ఓ అరుదైన వ్యాధికి గురై..  మంచి స్పీకర్‌గా,  రైటర్‌గా  గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరి జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా... అక్టోబరు 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.



    కాగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం. ఈ సినిమాను శుక్రవారం కెనడాలో టొరంటోలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో  సినిమా ప్రీమియర్‌ చూసిన ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. కన్నీరు కారుస్తూ.. సినిమా డైరెక్టర్ సోనాలీ బోస్‌ను హత్తుకున్నారు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవ్వడం.. సినిమా అద్బుతంగా ఉందని.. మెచ్చుకోవడంతో ప్రియాంకతో పాటు సినిమా డైరెక్టర్ సోనాలీ బోస్‌ కూడా భావోద్వేగానికి గురైయారు. కాగా.. దీనికి సంబందించిన  వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు