తెలుగు అంధాధున్‌లో నితిన్ హీరోయిన్‌గా మళ్లీ ఆమెనా..

హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా సూపర్ సక్సెస్ అయిన ‘అంధాధున్’  తెలుగులో రీమేక్‌ అవుతోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: May 24, 2020, 6:58 AM IST
తెలుగు అంధాధున్‌లో నితిన్ హీరోయిన్‌గా మళ్లీ ఆమెనా..
నితిన్ Photo : Twitter
  • Share this:
హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా సూపర్ సక్సెస్ అయిన ‘అంధాధున్’  తెలుగులో రీమేక్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా చేస్తోన్న ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్‌ను ఎంపిక చేశారనీ ఓ టాక్ నడిచింది. ప్రియాంక.. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్‌గా నటించి క్యూట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమాలో నితిన్ సరసన మరోసారి కీర్తి సురేష్ నటించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కీర్తి సురేష్ ఇప్పటకే నితిన్‌తో రంగ్ దేలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి మరో విశేషం ఏమంటే.. హిందీలో ‘టబు’ చేసిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణ చేయనుందని తెలుస్తోంది.‘అంధాధున్’లో టబు పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటూ.. నెగిటివ్ అండ్ బోల్డ్‌గా  ఉంటుంది. ఆ పాత్రలో టబు అదరగొట్టింది.

దీంతో అంతటి వెయిట్ ఉన్న పాత్రను తెలుగులో ఎవరు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మొదట ఆ పాత్రను టబుయే చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత యాంకర్ అనసూయ పేరు కూడా వినపడింది. ఎలాగూ టబు భారీ పారితోషకం డిమాండ్ చేస్తుంది కనుక మొదట అనసూయను తీసుకోవాలని చిత్రబృందం భావించింది. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు రమ్యకృష్ణను ఆ పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. ఇదే అదునుగా చూసుకొని ఈ చిత్రంలో నటించడానికి ఆమె పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తోందని టాక్. ఈ సినిమాలో నితిన్‌తో పాటు రమ్య కృష్ణది ప్రధాన పాత్ర కావడంతో పాటు సినిమాలో కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుండటంతో రమ్యకృష్ణ భారీగానే రెమ్యునరేషన్ అడుగుతుందని టాక్ వినిపిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: May 24, 2020, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading