హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: మహేష్ బాబుతో యంగ్ హీరోయిన్.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా ?

Mahesh Babu: మహేష్ బాబుతో యంగ్ హీరోయిన్.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా ?

Photo Twitter

Photo Twitter

ఈ సినిమాలో పూజా హెగ్డే కాకుండా ఫ్రెష్ హీరోయిన్ అయితే బావుంటుందని భావిస్తున్నారు. మహేష్ మూవీ ఛాన్స్ వస్తే మాత్రం ప్రియాంకా తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకున్నట్టే అని అభిమానులు అంచనా వేస్తున్నారు.

  ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో కొత్త సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో మహేష్ బాబు (Majesh Babu) ఇన్నేళ్ల కెరీర్‌లో చేయనటి వంటి ఓ అద్భుతం ఈ సినిమాలో చేయబోతున్నట్టు సమాచారం. దాంతో పాటు ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో కన్నడ స్టార్ హీరో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే దాదాపు ఫైనల్ అని అన్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) ని తీసుకుంటున్నట్టు టాక్.

  అయితే పూజా హెగ్దేతో(Pooja Hegde) మహేష్ ఆల్రెడీ మహర్షి సినిమా చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు చేశాడు. పూజా హెగ్దే కన్నా ఫ్రెష్ ఫేస్ హీరోయిన్ అయితేనే తన సినిమాలో బాగుంటుందని మహేష్ భావిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ నాని గ్యాంగ్ లీడర్ (Gang Leader) సినిమాలో నటించింది.ఆ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం సినిమా కూడా చేసింది.తెలుగులో పెద్దగా సక్సెస్ అందుకోని ప్రియాంకా తమిళంలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటుంది. అయితే మహేష్ మూవీ ఛాన్స్ వస్తే మాత్రం ప్రియాంకా తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకున్నట్టే లెక్క. మహేష్ సరసన ప్రియాంక నటిస్తుందా లేదా అన్నది త్వరలో డీటైల్స్ తెలుస్తాయి.

  మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా(Khaleja) సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా తన కెరీర్‌లో ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.

  ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీ లో ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక కాలనీ సెట్ కూడా రెడీ చేస్తున్నారట.యూరప్ వెకేషన్ కోసం వెళ్లిన మహేష్ ఇప్పట్లో తిరిగి రారని త్రివిక్రమ్ మహేష్ బాబు దగ్గరికే వెళ్లి కొన్ని విషయాలపై చర్చలు చేస్తున్నారట.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Mahesh Babu, Pooja Hegde, Priyanka Arul Mohan, Trivikram Srinivas Mahesh babu

  ఉత్తమ కథలు