HOME »NEWS »MOVIE »priyanka arul mohan replaced rashmikamandanna in surya movie with surya movie mhn

Rashmika mandanna: ర‌ష్మిక మంద‌న్న‌కు షాకిచ్చిన అప్‌క‌మింగ్ హీరోయిన్‌..!

Rashmika mandanna: ర‌ష్మిక మంద‌న్న‌కు షాకిచ్చిన అప్‌క‌మింగ్ హీరోయిన్‌..!
Priyanka Arul Mohan replaced Rashmika mandanna in surya movie with Surya movie

Rashmikamandanna - Priyanka Arul Mohan: అప్‌కమింగ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, స్టార్ హీరో సూర్య సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.

  • Share this:
    టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రైన ర‌ష్మిక మంద‌న్న‌కు ఓ అప్‌క‌మింగ్ హీరోయిన్ పెద్ద షాకే ఇచ్చింది. ఇంత‌కీ ర‌ష్మిక మంద‌న్న‌కు అంత‌పెద్ద రేంజ్‌లో షాకిచ్చిన హీరోయిన్ ఎవ‌రు ? అని అనుకుంటున్నారా!..ప్రియాంక అరుల్ మోహ‌న్‌. నాని హీరోగా న‌టించిన గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన‌ప్రియాంక అరుల్ మోహ‌న్ ఇప్పుడు శ‌ర్వానంద్ హీరోగా నటిస్తోన్న శ్రీకారం సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. త‌మిళంలోనూ శివ కార్తికేయ‌న్ హీరోగా చేసిన డాక్ట‌ర్ సినిమాలోనూ ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహ‌న్ నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంద‌ని టాక్ వినిపిస్తోంది.

    అందులో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరోస్‌లో ఒక‌రైన సూర్య చిత్రంలో ప్రియాంక అరుల్ మోహ‌న్ అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సూర్య, పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌దుప‌రి సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ముందుగా ర‌ష్మిక మంద‌న్నను హీరోయిన్‌గా నటింప చేయ‌డానికి ముందు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ హై రెమ్యున‌రేష‌న్ కార‌ణంగా ర‌ష్మిక మందన్న‌ను తీసుకోవ‌డానికి నిర్మాత‌లు వెనుక‌డుగు వేశారు. చివ‌ర‌కు ఆమె స్థానంలో ప్రియాంక అరుల్ మోహ‌న్‌ను తీసుకున్నార‌ట.



    rashmika mandanna, priyanka arul mohan, priyanka arul mohan replaced by rashmika mandanna, hero surya, prayanka arul mohan in surya movie, director pandiraj, surya and pandiraj movie, surya next movie, vaadivaasal, vetrimaaran movie, సూర్య, రష్మిక మందన్న, ప్రియాంక అరుల్ మోహన్
    Priyanka Arul Mohan replaced Rashmikamandanna in surya movie with Surya movie


    సూర్య ప్ర‌స్తుతం జ్ఞాన‌వేల్ అనే ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నాడు. ఇందులో సూర్య కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దీని త‌ర్వాత పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య సినిమా చేస్తాడు. దీని త‌ర్వాత వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ‘వాడివాస‌ల్‌’సినిమా చేస్తాడు. గ‌త ఏడాది ఓటీటీలో విడుద‌లైన ‘ఆకాశం నీ హద్దురా’ స‌క్సెస్‌తో భారీ హిట్ సాధించాడు సూర్య‌.
    Published by:Anil
    First published:January 21, 2021, 13:35 IST

    टॉप स्टोरीज