news18-telugu
Updated: December 4, 2019, 5:23 PM IST
ప్రియమణి (ఫైల్ ఫోటో)
కొన్ని పాత్రలు పోషించడం అంత ఈజీ కాదు. అందులోనూ బయోపిక్‌లోని పాత్రలు చేయడం ఒక పెద్ద సవాల్. మరి ఆ పాత్ర తమిళనాడుకు చెందిన శశికళ పాత్ర అంటే ఎవరికైనా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి పాత్రకు ప్రియమణి ఎంపికైంది. తమిళనాడులో జయలలిత స్నేహితురాలిగా కొనసాగుతూ... అన్నాడీఎంకేలో అమ్మ తరువాత అంతా తానై వ్యవహరించిన శశికళపై అనేక ఆరోపణలు ఉన్నాయి. జయలలిత అక్రమాస్తుల కేసులోనూ దోషిగా ఉన్న శశికళ... తనను నమ్మిన జయలలితను చంపడానికి కుట్ర చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. జయలలితను శశికళ వెన్నుపోటు పొడిచారని ఆమె అభిమానులు ఫీలవుతుంటారు.

వీకె శశికళ(File)
నిజానిజాలేంటో తెలియవు కానీ... జయలలిత రియల్ లైఫ్‌లో రియల్ విలన్ శశికళ అనే కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో శశికళ పాత్ర ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ మూవీ లవర్స్‌లో నెలకొంది.

జయలలిత బయోపిక్ తలైవి పోస్టర్
కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటించబోతున్న ఈ సినిమాలో శశికళ పాత్ర ఎవరు పోషిస్తారనే దానిపై రీసెంట్గా క్లారిటీ వచ్చింది. ఈ పాత్ర కోసం దర్శకుడు విజయ్ ప్రియమణిని ఎంపిక చేశారని తెలుస్తోంది. జయలలిత జీవితాన్ని శశికళ అధికంగా ప్రభావితం చేయడంతో మూవీలో ఈ పాత్ర కీలకంగా మారింది.
Published by:
Kishore Akkaladevi
First published:
December 4, 2019, 5:23 PM IST