PRIYAMANI PLAYS CHEF ROLE IN HIS STORYY WHO CANT BOIL AN EGG NR
Priyamani: నాకు గుడ్డు ఉడకబెట్టడం కూడా రాదు.. కానీ చెఫ్ అయ్యా: ప్రియమణి
priyamani
Priyamani: టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ ప్రియమణి వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అచ్చమైన తెలుగు అమ్మాయిల సినిమాలలో బాగా ఆకట్టుకుంది.
Priyamani: టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ ప్రియమణి వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అచ్చమైన తెలుగు అమ్మాయిల సినిమాలలో బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత రాను రాను తన అందాన్ని కాస్త గ్లామర్ గా మార్చుకుంది. ఇక కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న మళ్లీ అడుగు పెడుతూ కథ డిమాండ్ పై ఆధారపడుతుంది. ఇదిలా ఉంటే ప్రియమణికి గుడ్డు కూడా ఉడకబెట్టడం రాదట.
ప్రశాంత్ భాగియా దర్శకత్వంలో 'హిజ్ స్టోరీ' అనే హిందీ వెబ్ సిరీస్ తెరకెక్కింది. బాలాజీ టెలీ ఫిలింస్, డింగ్ ఇన్ఫినిటీ సంస్థలు ఈ సిరీస్ ను నిర్మించాయి. ఏప్రిల్ 25న ఓటీటీ లో ఈ సిరీస్ విడుదల కాగా.. ఇందులో ప్రియమణి, సత్య దీప్ మిశ్రా, మృణాల్ దత్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సిరీస్ లో ప్రియమణి సాక్షి అనే చెఫ్ పాత్రలో నటించింది. ఇక ఆమె పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సిరీస్ లో తను చెఫ్ గా నటించడమే కానీ నిజంగా తనకు కోడిగుడ్డు ఉడక పెట్టడం కూడా తెలియదని ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో ఉన్న యువకులు తనకంటే బాగా వంట చేసేవారట. అలాంటిది తను వంట గదిలో చేసే పోరాటాన్ని చూసి సెట్లో అందరూ నవ్వుకునేవారని.. ఇక తన తోటి సహనటులు ఆమెపై తెగ జోకులు వేసుకునేవారని.. ఇక ఈ సినిమాలో తన నటనను చూసి ప్రేక్షకులు మెచ్చుకున్నారని తెలిపింది ప్రియమణి. ఇక ప్రస్తుతం ఆమె తెలుగు బుల్లితెరలో షో లలో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా విరాటపర్వం, నారప్ప వరుస సినిమాల్లో నటించగా ప్రస్తుతం ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో మైదాన్ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమాలో ఓ పాత్రలో నటిస్తుందట.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.