Priya Prakash Varrier: ప్రియా ప్రకాశ్ అందాల కనువిందు బోర్ కొట్టిందా? ఇక వీనుల విందుకు రెడీ అయిపోండి

Priya Prakash Warrier to mesmerize fans with her singing talent

Priya Prakash Varrier - Telugu Song: వింకీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగు ప్రేక్షకులకు తనలో మరో టాలెంట్‌ని పరిచయం చేయనుంది. ఇంతకీ ప్రియా ప్రకాశ్ ఎందులో టాలెంట్ చూపించనుందో తెలుసా..!

  • Share this:
    పాపులారిటీ తెచ్చుకోవ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని.. అన్నీ రంగాల్లోనూ అది సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. అలాంటి పాపులారిటీని అల‌వోక‌గా సంపాదించుకున్న హీరోయిన్, మ‌లయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. మలయాళంలో ఆమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్‌’లో కన్నుగీటే సీన్‌కి సంబంధించిన టీజర్ విడుదల కాగానే.. రాత్రికి రాత్రే ప్రియా ప్రకాశ్ వారియర్ పెద్ద స్టార్‌గా మారిపోయింది. ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. త‌ర్వాత ‘శ్రీదేవి బంగ్లా’ సినిమాలో న‌టించింది. తెలుగులో నితిన్ ‘చెక్’ చిత్రంలో న‌టించింది.ఈ రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

    ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ స‌మాచారం ఒక‌టి తెలిసింది. అదేంటంటే.. ఇప్పుడు కనులకు అందాలతో విందు చేసిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ వీనుల విందు చేయ‌డానికి సిద్ధ‌మైంది. అంటే పాట పాడింది. వివరాల్లోకి వెళితే అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల సంగీతంలో ఓ ఆల్బమ్ రూపొందింది. అందులో ప్రియాప్రకాశ్ వారియర్ తెలుగులో పాట పాడిందట. ఇప్పటికే మలయాళం, కన్నడ భాషల్లో పాటలు పాడి మెప్పించిన ప్రియా ప్రకాశ్ ఈసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మైంది.

    ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాకు ముందు పాపులారిటీ సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సినిమా ప్లాప్ కావ‌డంతో ఉన్న అవ‌కాశాలు పోయాయి. ఇప్పుడు పెద్ద‌గా అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి.
    Published by:Anil
    First published: