యువతకు మత్తెక్కిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్

news18-telugu
Updated: September 11, 2018, 3:23 AM IST
యువతకు మత్తెక్కిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్
ప్రియా ప్రకాశ్ వారియర్(Photo: Priya.p.varrier/Instagram)
  • Share this:
ప్రియాప్రకాశ్ వారియర్...! ఈ తరం యువతకి ఏమాత్రం పరిచయం ఎక్కర్లేని పేరు. కేవలం తన జాలు వారే కనులతో ఓ సైగ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ మలయాళ భామ. ఈ కుట్టి తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు తన క్యూట్ క్యూట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె అకౌంట్ కి ఏకంగా 6.4M ఫాలోవర్స్ ఉండటం విశేషం.

ఈ ముద్దు గుమ్మ తాజాగా ఎరుపు రంగు చీరలో ఓ ఫోటో షూట్ చేసింది. ఇందులో తన రింగు జుట్టుని స్ట్రెయిట్ చేసుకుని మరింత అందంగా..తన తేనె కళ్ళతో పర్ఫెక్ట్ మేకప్ తో కనిపించింది. ఆ ఫోటోలను చూసిన ఎవరైనా ఆమె ప్రేమలో పడటం మాత్రం ఖాయంగా ఆ ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫోటోషూట్ అక్కడి లోకల్ మ్యాగజైన్ కోసం జరిపారు. ఈ తాజా ఫోటోలకు ఒక్కో దానికీ దాదాపు 5 లక్షల లైక్స్ వచ్చాయి. ఓరు ఆధార్ లవ్ సినిమా టీజర్ తో అందరికి చేరువైన ప్రియా ప్రకాష్ కి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. సినిమా విడుదలయ్యాక ప్రియా ప్రకాష్, యువతకు ఏ స్థాయిలో గిలిగింతలు పెడుతుందో చూడాలి.
Published by: Vijay Bhaskar Harijana
First published: September 11, 2018, 3:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading