• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PRIYA PRAKASH VARRIER TAKEN CORONA FIRST DOSE VACCINATION HERE ARE THE DETAILS TA

Priya Prakash Varrier: కరోనా ఫస్ట్ డోస్ టీకా తీసుకున్న వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్..

కరోనా టీకా తీసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ (Instagram/Photo)

Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్...  ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్నా... ఆమె నటించిన మొదటి సినిమా 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

  • Share this:
    Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్...  ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్నా... ఆమె నటించిన మొదటి సినిమా 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తూ వార్తల్లో ఉంటోంది  ఈ భామ. 2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు. వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి... చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్... సోషల్ మీడియాలో మాత్రం చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తాజాగా ఈ భామ కరోనా తొలి డోసు టీకా తీసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 18 యేళ్లు పై బడిన  ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తానంటూ ప్రకటించింది. ఈ నెల 21 యోగా డే నుంచి ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో  సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు అందరు టీకాలు తీసుకుంటూ సామాన్య ప్రజలకు టీకా పై సందేహాలను నివృత్తి చేస్తున్నారు.



    మోడలింగ్ చేస్తూ... బ్యూటీ పేజెంట్స్‌లో ర్యాంప్ వాక్‌తో కట్టిపడేస్తోంది. అది అలా ఉంటే ప్రియా, నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో పలకరించింది. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. దీంతో తెలుగులో పాగా వేయాలనుకున్న ప్రియా వారియర్ ఆశలకు ఈ సినిమా బ్రేకులు వేసింది. అప్పట్లో తన పై వచ్చే ట్రోల్స్ భరించలేక ఇన్‌స్టాగ్రామ్ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: