‘ఒరు అదార్ లవ్’ దర్శకుడికి కౌంటర్ ఇచ్చిన ప్రియా వారియర్..

స‌రిగ్గా నెల అంటే నెల రోజుల కింద మన దేశం అంతా ప్రియా వారియ‌ర్ జ‌పం చేసింది. ఈమె న‌టించిన తొలి సినిమా ‘ల‌వ‌ర్స్ డే’ విడుద‌ల‌కు ముందు అంతా ఆమె వ‌చ్చి ఏదో మాయ చేస్తార‌ని న‌మ్మారు. కానీ ఈ సినిమా రావ‌డం.. డిజాస్ట‌ర్ కావ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి.తాజాగా ఈ సినిమా ఫ్లాప్‌కు కారణం మీరంటే మీరని దర్శకుడు ఒమర్ లులుతో పాటు ప్రియా వారియర్ రచ్చ కెక్కారు.

news18-telugu
Updated: March 12, 2019, 3:30 PM IST
‘ఒరు అదార్ లవ్’ దర్శకుడికి కౌంటర్ ఇచ్చిన ప్రియా వారియర్..
ప్రియా వారియర్
  • Share this:
స‌రిగ్గా నెల అంటే నెల రోజుల కింద మన దేశం అంతా ప్రియా వారియ‌ర్ జ‌పం చేసింది. ఈమె న‌టించిన తొలి సినిమా ‘ల‌వ‌ర్స్ డే’ విడుద‌ల‌కు ముందు అంతా ఆమె వ‌చ్చి ఏదో మాయ చేస్తార‌ని న‌మ్మారు. కానీ ఈ సినిమా రావ‌డం.. డిజాస్ట‌ర్ కావ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. ముందుగా ఈ సినిమాలో ప్రియా వారియర్‌ను సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. కానీ అప్పటికే  మాణిక్య మలయారు పాటలో కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా వారియర్.  ఆ వీడియోను చూసి ఈ సినిమాలో ప్రియానే మెయిన్ హీరోయిన్ అనుకున్నారు. కనుసైగతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ పాపులారిటీ చూసి నిర్మాతలు దర్శకుడితో ఈ సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయించి తెరకెక్కించారు.  టాలీవుడ్‌లో సైతం ఈ సినిమాకు సైతం విపరీతమైన హైప్ లభించింది. దీంతో ప్రియా క్యారెక్టర్ పెరిగి..అసలు హీరోయన్ నూరిన్ షరీష్ క్యారెక్టర్ తగ్గించారు. దీంతో ఈ సినిమా కంగాళీగా మారి అసలుకే ఎసరు తీసుకొచ్చింది.

దీంతో ఈ సినిమా డైరెక్టర్ ఒమర్ లులూ ప్రియా వారియర్‌పై బహిరంగానే విమర్శలు చేసాడు. కథను మార్చమని నిర్మాతలు తనపై ఒత్తిడి చేయడంతో ఈ సినిమా ప్లాపైందని చెప్పుకొచ్చాడు. మరోవైపు ఈ సినిమాలో నటించిన నూరిన్ షరీఫ్‌ కూడా ప్రియా వారియర్ పై నిప్పులు చెరిగింది. దర్శకుడు, తోటి నటి చేసిన విమర్శలపై ప్రియా వారియర్‌ స్పందించింది. తాను గనుక నోరు విప్పితే విమర్శలు చేసే వారి సంగతి ఏమవుతుందో  ఆలోచించుకోవాలని గట్టి వార్నింగే ఇచ్చింది. తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానని , తనపై వస్తున్న విమర్శలకు కాలమే జవాబు చెబుతుందని  ఒకింత వేదాంత ధోరణిలో బదులు చెప్పింది. మొత్తానికి ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

 

 
First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading