• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PRIYA PRAKASH VARRIER REPLY TO A CELEBRITY WHO WANTS TO BITE HER LIPS WILL GIVE A SHOCK TO YOU BA

Priya Prakash Varrier: కుర్రాడికి లిప్స్ కొరకడం నేర్పిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్

ప్రియా ప్రకాష్ వారియర్ (Instagram/Photo)

ప్రియా ప్రకాష్ వారియర్ ఇన్ స్టా రీల్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో పక్కన కామెంట్స్ బాక్సులో శరణ్ నాయర్ ఓ కామెంట్ చేశాడు. ‘నీ పెదాలు కొరకడం ఎలాగో నేర్పు.’ అని అడిగాడు. దీనికి ప్రియా కూడా చాలా క్యాజువల్ గా స్పందించింది.

  • Share this:
    ప్రియా ప్రకాష్ వారియర్ అప్పుడెప్పుడో ఒరు ఆదార్ లవ్ సినిమాతో మొత్తం కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆమె కన్నుకొట్టడం చూసి కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయింది. ఆ తర్వాత గన్ తో కాల్చినట్టు చేసిన ఫోజులు ఇంకా పిచ్చిక్చించేశాయి. ఇప్పటికీ ప్రియా ప్రకాష్ వారియర్ అనగానే ఆమె కన్ను కొట్టిన సీన్లు, బుల్లెట్లు గుండెల్లో దించిన దృశ్యాలు కళ్లముందు కదులుతూ ఉంటాయి. అలాంటి అమ్మడు నవ్వుతుంటే కుర్రాళ్లకు గుండె ఝల్లుమంటుంటుంది. కానీ, కొందరు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాలో ఆమెతో వెకిలి చేష్టలు చేస్తుంటారు. ఆ దెబ్బతోనే ఆమెకొన్నాళ్లు సోషల్ మీడియాకు బ్రేక్ కూడా తీసుకుంది. అయితే, తాజాగా ఓ ఇన్ స్టా సెలబ్రిటీ ఒకరు ఆమె పెదాలను ఎలా కొరకాలో నేర్పాలని ఆమెనే అడిగాడు.

    ప్రియా ప్రకాష్ వారియర్ ఇన్ స్టా రీల్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో పక్కన కామెంట్స్ బాక్సులో శరణ్ నాయర్ ఓ కామెంట్ చేశాడు. ‘నీ పెదాలు కొరకడం ఎలాగో నేర్పు.’ అని అడిగాడు. దీనికి ప్రియా కూడా చాలా క్యాజువల్ గా స్పందించింది. ‘మ్... నేర్పుతా’ అని చెప్పింది. కింద ఇచ్చిన వీడియోలో కామెంట్స్ సెక్షన్‌లో దీన్ని మనం చూడొచ్చు.




    శరణ్ నాయర్‌కి అమ్మడు నేర్పుతా అనడంతో ఇక కుర్రాళ్లకు మంచి కిక్ వచ్చింది. నాక్కూడా నేర్పవా అంటూ ఆటలాడడం మొదలు పెట్టారు. కామెంట్స్, లైక్స్‌తో హోరెత్తించారు. చాలా మంది నేను కూడా క్యూలో ఉన్నానంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. కొందరైతు శరణ్ నాయర్ చేసిన కామెంట్ను విపరీతంగా లైక్ చేస్తున్నారు.




    ఎవరీ శరణ్ నాయర్
    శరణ్ నాయర్ వెబ్ సిరీస్ స్టార్ కమెడియన్. నెట్ ఫ్లిక్స్‌లో వచ్చిన Grandma reaction to sacred games లో మంచి పేరు వచ్చింది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కామెడీ చేస్తాడు. హ్యాండ్సమ్ కుర్రాడు. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా వస్తున్న చెక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: