• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PRIYA PRAKASH VARRIER FELL DOWN IN CHECK SHOOTING SHARES VIDEO ON SOCIAL MEDIA MNJ

Priya Prakash Varrier: జీవితం నాతో ఎలా ఆడుకుంటుందో చూడండి.. వీడియో షేర్ చేసిన వింక్ బ్యూటీ

Instagram

Priya Prakash Varrier: ఒక చిన్న వీడియోతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది వింక్ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. దీంతో ఆమెకు వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. అయితే ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో మాలీవుడ్ కంటే టాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టిన ప్రియా

  • Share this:
    Priya Prakash Varrier: ఒక చిన్న వీడియోతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది వింక్ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. దీంతో ఆమెకు వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. అయితే ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో మాలీవుడ్ కంటే టాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టిన ప్రియా.. ఆ మ‌ధ్య‌న ఒక ఆల్బ‌మ్ సాంగ్‌లో మెరిసింది. ఈ పాట‌లో డ్యాన్స్ వేయ‌డంతో పాటు ఆమె పాడ‌టం విశేషం. ఇక నితిన్ స‌ర‌స‌న ప్రియా వారియ‌ర్ న‌టించిన చెక్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రికొన్ని గంటల్లో ఈ చిత్రం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన ఓ వీడియోను ప్రియా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో వెనుకాల నుంచి వ‌స్తూ నితిన్‌పైకి ఎక్కే ప్రియా.. ఊహించ‌ని విధంగా కింద ప‌డిపోయింది.

    దీన్ని షేర్ చేసిన ప్రియా.. జీవితం ప్ర‌తి సారి న‌న్ను ఎలా తొక్కుతుందో చూపే వీడియో. న‌మ్మ‌కం అనే ఆకును ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించా అని ఆమె కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోలో ప్రియా ప‌డిపోగానే అక్క‌డున్న వారంద‌రూ వ‌స్తారు. ఆ త‌రువాత ప్రియా కూడా షూటింగ్‌కి రెడీ అవుతుంది.




    ఇదిలా ఉంటే థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన చెక్‌పై అంద‌రిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచాయి. ఇక ఈ మూవీ కోసం నితిన్ అభిమానులే కాదు సాధార‌ణ ప్రేక్ష‌కులు సైతం ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు ఈ మూవీపై స్పందించిన ఎన్టీఆర్.. చెక్ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు. దానికి స్పందించిన నితిన్.. ఈ సినిమా క‌చ్చితంగా నీకు న‌చ్చుతుందంటూ కామెంట్ పెట్టారు.
    Published by:Manjula S
    First published: