• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRIYA PRAKASH VARRIER COMPLETELY DOMINATING RAKUL PREET SINGH WITH HER GLAMOUR IN CHECK MOVIE PK

Priya Prakash Varrier: రకుల్ ప్రీత్ సింగ్‌ను పూర్తిగా డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్..

Priya Prakash Varrier: రకుల్ ప్రీత్ సింగ్‌ను పూర్తిగా డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్..

రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా వారియర్ (rakul preet priya varrier)

Priya Prakash Varrier: చెక్ సినిమా విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్రియా వారియర్.. కొన్ని రోజుల కింద ఈ పేరు ఇండియా అంతా మార్మోగిపోయింది. కానీ ఆరంభశూరత్వం అంటారు కదా.. అలా కొన్ని రోజులు మాత్రమే ఈమె పేరు వినిపించింది.

  • Share this:
చెక్ సినిమా విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్రియా వారియర్.. కొన్ని రోజుల కింద ఈ పేరు ఇండియా అంతా మార్మోగిపోయింది. కానీ ఆరంభశూరత్వం అంటారు కదా.. అలా కొన్ని రోజులు మాత్రమే ఈమె పేరు వినిపించింది. ఆ తర్వాత వినిపించడం ఆగిపోయింది. చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి కొత్త అవకాశాలు రావడం గగనం అయిపోయింది. మలయాళ సినిమా ఒరు అదార్ లవ్ విడుదల కాకముందు ప్రియా కోసం ఎగబడిన వాళ్లే.. ఆ సినిమా విడుదలైన తర్వాత అవసరం లేదు అనుకున్నారు. కన్నుగీటి పడేసిన ఈ సుందరి డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన నిర్మాతలే.. ఆ తర్వాత లైట్ తీసుకున్నారు. దాంతో అందాల ఆరబోతను నమ్ముకుని సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలు పెట్టింది ప్రియా. ఛాన్సులు రాకపోయేసరికి చాలా రోజుల పాటు వేచి చూసింది. ఇన్నాళ్లకు శ్రమ ఫలించి చెక్ సినిమాలో అవకాశం వచ్చింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాను చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించాడు. ఈ సినిమాలో అమ్మడు ఫుల్లుగా గ్లామర్ షో చేసింది. అదిరిపోయే సెక్సీ షోతో పిచ్చెక్కిస్తుంది ప్రియా వారియర్. తాజాగా విడుదలైన నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను పాటలో అయితే అమ్మాయిగారి సొగసులకు అంతా ఫిదా అయిపోవాల్సిందే. పాటలోనే ఇంతగా రెచ్చిపోతే సినిమాలో ఇంకెంత రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

చాలా ఏళ్ళ తర్వాత యేలేటి కూడా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. చెక్ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అమ్మడు చేస్తున్న రచ్చ చూస్తుంటే ఇందులో రకుల్ అనే మరో హీరోయిన్ ఉందనే విషయం కూడా ప్రేక్షకులు మరిచిపోయారు. మరి ఈ సినిమాతో ప్రియా వారియర్ కెరీర్ ఎలాంటి మలుపు తిరగబోతుందో చూడాలి. ఫిబ్రవరి 26న విడుదల కానుంది చెక్. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు