• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRIYA PRAKASH VARRIER BEAKS ZOMBIE REDDY HERO TEJA SAJJA HEART THE ISHQ 1ST ZOLT FIRST LOOK RELEASED SR

Priya Prakash Varrier : జాంబీరెడ్డి హీరో హృదయాన్ని ముక్కలు చేసిన ప్రియా ప్రకాష్ వారియర్..

Priya Prakash Varrier : జాంబీరెడ్డి హీరో హృదయాన్ని ముక్కలు చేసిన ప్రియా ప్రకాష్ వారియర్..

Priya Prakash and Teja Sajja Photo : Twitter

Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది మలయాళీ కుట్టి.

  • Share this:
    Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది మలయాళీ కుట్టి. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన మొదటి సినిమా 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే నేం ఆమెకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ప్రియా వరుస సినిమాలను చేస్తోంది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో వచ్చిన చెక్ సినిమాలో ప్రియా మేయిన్ లీడ్ చేసింది. ఈ సినిమాలో రకుల్ ఉన్నా ఆమెది లాయర్ పాత్రే.. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో ప్రియా బాగానే గ్లామర్ షో చేసింది. అది కూడా జనాలను థియేటర్‌కు రప్పించలేకపోయింది. ఇక అది అలా ఉంటే తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్‌ తెలుగులో మరో సినిమా చేస్తోంది. తేజా సజ్జాతో ఇష్క్ అనే సినిమాను చేస్తోంది. తేజా సజ్జా బాల నటుడిగా పరిచయమే.. ఆయన హీరోగా ఇటీవల జాంబీ రెడ్డి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ క్రేజీ కామెడీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. జాంబీల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టింది.

    ఇక ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇష్క్. ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ వస్తోన్న ఈ సినిమా పోస్టర్ కాస్తా విచిత్రంగా ఉంది. తేజా ప్రియా ప్రకాష్ వారియర్‌లు విడిపోతున్నట్లుగా ఉంది. తేజ సీరియస్‌గా కనిపిస్తుండగా, ప్రియా ముఖం మీద చిరునవ్వుతో కనిపిస్తుంది. ఇక ఇది ప్రేమకథ కాదు అనే ట్యాగ్‌లైన్‌ను ఇచ్చారు.

    ఈ సినిమాను SS రాజు దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్బీ చౌదరి దీనిని సమర్పిస్తున్నాడు. మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో థియేటర్స్ విడుదలకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: