Bigg Boss 5 Telugu Priya - sunny: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మొదటి రోజు నుండే షో మొత్తం హైలెట్ గా మారింది. ఇప్పటివరకు ప్రసారమైన నాలుగు సీజన్ లలో కూడా ఇంత ఫైర్ చూడలేదు. కానీ ఈ సీజన్ లో పాల్గొన్న వాళ్ళందరూ చాలావరకు ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. ముఖ్యంగా లేడీస్ కంటెస్టెంట్స్ గురించి వారి మాటల గురించి చెప్పడం కంటే చూడటం బెటర్. ఎందుకంటే బూతు మాటలతో అందర్నీ షాక్ కు గురి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రియ, సన్నీల మధ్య మరోసారి రచ్చ రచ్చ జరిగింది.
రోజురోజుకు ఈ షోలో కంటెస్టెంట్లందరు తమ మాటలతో బాగా రెచ్చిపోతున్నారు. మొదటి రెండు రోజులు పరిచయాలు పెంచుకున్నారు. అంతా బాగానే ఉన్నారు. కానీ రెండవ రోజు గడుస్తున్నకొద్దీ స్టార్ట్ అయింది అసలు యుద్ధం. ఆ రోజు నుండి ఇప్పటివరకు ఎవరు ఎక్కడ తగ్గడం లేదు. ఒకవైపు కలిసినట్లే అనిపిస్తున్నారు కాని అంతలోనే మాటల యుద్ధంతో విడిపోతున్నారు.
ఇప్పటివరకు మాటల యుద్ధం చూసాం.. నిన్నటి నుండి కొట్లాట యుద్ధం కూడా ప్రారంభమయ్యింది. ఇక ఈ షోను చూసిన ప్రేక్షకులు మాత్రం మీరు ఇలా ఉంటేనే మాకు నచ్చుతుంది అని కామెంట్లు కూడా చేస్తున్నారు. అంటే ఈ గొడవల వల్ల ప్రేక్షకులు మరింత సందడి చేస్తున్నారు తప్ప ఈ షోని విమర్శించడం లేదని అర్థమవుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో ప్రారంభంలోని సన్నీ, ప్రియ గొడవ పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి:షోలో అందరూ ల* పనులే చేస్తున్నారంటూ రెచ్చిపోయిన శ్వేతా వర్మ.. ఒక్కసారిగా షాక్?
నీ ఆటిట్యూడ్ నా దగ్గర చూపించకు.. నోరు మూసుకొని నీ పని ఏంటి నువ్వు చూసుకో అని ప్రియ సన్నీతో వాదనకు దిగగా.. వెంటనే సన్నీ నోరు మూసుకొని అనడం తప్పు అంట ప్రియ గారు అని అన్నాడు. అంతటితో ఆగని ప్రియ షట్ అప్ అని కూడా అంటాను అని రెచ్చిపోయింది. ఇక సన్నీ అస్సలు ఆగలేదు. తన ముందు ఒక మహిళ ఎదురు తిరుగుతుందని అనుకున్నాడేమో కానీ అతడు కూడా ఎదురు తిరిగాడు. కానీ ప్రియ మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.
ఇక మధ్యలో ఇతర కంటెస్టెంట్ ల మధ్య కూడా కొన్ని వాదనలు జరిగాయి. మళ్లీ ప్రియ సన్నీ ని ఉద్దేశించి ఆడు ఈడు అని అనడంతో వెంటనే అతనికి కోపం వచ్చి ఆడు ఈడు ఏంటి అని ప్రశ్నించాడు. కానీ ప్రియ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఆడు అంటే నువ్వేనా అని గట్టిగా బదులిచ్చింది. అంతేకాదండోయ్ దమ్ముంటే వచ్చి మగాడిలా ఆడాలని వాదనకు దిగడంతో.. రా ఆడదాం.. మగతనం చూపిస్తా అంటూ తన మాటలతో రెచ్చిపోయాడు సన్నీ. మొత్తానికి వారి మధ్య గొడవ గట్టిగానే జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Telugu, Kajal, Manaas, Priya, Siri, Sree ramachandra, Sunny