RRR - Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా వేయాల‌ని జ‌క్క‌న్న‌పై ఒత్తిడి!

Presure building Rajamouli to RRR Postponement will he accept

RRR - Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఆలస్యం వెనుక పెద్ద తతంగమే నడించిందని గుస గుసలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ట్రిపుల్ ఆర్ ఇప్ప‌టికే రెండుసార్లు వాయిదా ప‌డింది. ఇంకోసారి కూడా వాయిదా వేయాల‌ని జ‌క్క‌న్న‌మీద ఒత్తిడి తెస్తున్నారట వాళ్లు. ఇంత‌కీ ఎవ‌రు వారు? న‌ంద‌మూరి అభిమానులా? మెగా అభిమానులా? లేకుంటే మేక‌ర్స్ త‌ర‌ఫు వారా? ప్యాన్ ఇండియా మూవీ కావ‌డంతో నార్త్ వైపు వాళ్లా..?. నార్త్, సౌత్ వాళ్ల సంగ‌తి కాదు... బ‌య్య‌ర్లు! ఇప్పుడున్న లెక్క ప్ర‌కారం 2021 స‌మ్మ‌ర్‌కి ట్రిపుల్ ఆర్ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇంకా షూటింగ్ పూర్తి కానే లేదు. వీఎఫ్ ఎక్స్ ప‌రంగా బోలెడు ప‌నులున్నాయ్‌. సో నో ఛాన్సు. మ‌రి కాస్త ఆగి ద‌స‌రాకు వ‌స్తే.. అంత పెద్ద సినిమా, అన్నేసి కోట్ల బ‌డ్జెట్‌, పైగా ఆసేతు హిమాచ‌లాన్ని ఊరిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ అనే టైటిల్‌, బాహుబ‌లి మేక‌ర్ నుంచి వ‌స్తున్న ప్రాజెక్ట్... మ‌రీ ప‌ది రోజుల సెల‌వుల‌కు వ‌చ్చేస్తే , బ్యాలెన్స్ వ‌సూళ్లు ఏం కావాలి? అందుకే అయిన లేటు ఎలాగూ అయింది క‌దా, 2022 స‌మ్మ‌ర్‌కి పిక్స్ అవ్వ‌మ‌ని జ‌క్క‌న్న‌కు స‌జెష‌న్స్ వెళ్తున్నాయ‌ట బ‌య్య‌ర్ల నుంచి.

    2021 పొంగ‌ల్‌ని టార్గెట్ చేసి, ఎక్కువ స్క్రీన్స్ లో వేస్తే బావుంటుంద‌ని కొంద‌రి ఫీలింగ్‌. క్రిస్మ‌స్ లీవులు, పొంగ‌ల్ లీవులు క‌లిస్తే కూడా ప్యాన్ ఇండియా లెవ‌ల్లో వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డం ఎంత వ‌ర‌కు సాధ్యం? అదే ఇంకో మూడు నెల‌లు ఆగి ఎర్లీ స‌మ్మ‌ర్‌లో స్ట్రాంగ్‌గా రిలీజ్ అయితే, ఇప్ప‌టిదాకా వ‌ర‌ల్డ్ వైడ్ ఉన్న క‌లెక్ష‌న్ల చిట్టాలో ఫ‌స్ట్ ప్లేస్‌ని టార్గెట్ చేయొచ్చ‌న్న‌ది జ‌క్క‌న్న‌కు వెల్ విష‌ర్స్ చెబుతున్న మాట‌.

    ఓ వైపు పెరుగుతున్న వ‌డ్డీలు, ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్ లు, జ‌క్క‌న్న వీటిని క‌న్సిడ‌ర్ చేస్తారా? లేకుంటే బ‌య్య‌ర్ల మాట‌కు విలువిచ్చి స‌మ్మ‌ర్ రేస్‌లో జాయిన్ అయి, రికార్డుల ఫిగ‌ర్ల‌ను ఎయిమ్ చేస్తారా తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. ఎక్కువ రోజులు ఆగితే మిగిలిన సినిమాలు రిలీజ్ డేట్ల‌ను ప్లాన్ చేసుకోవాలి. వాళ్ల కోస‌మైనా జ‌క్క‌న్న ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్‌ని ప్ర‌క‌టించాలి కాబ‌ట్టి, ఫిల్మీ ఇన్న‌ర్ సర్కిల్స్ లో అయినా, ఏదో ఒక విష‌యం క్లారిటీకి వ‌చ్చేస్తుంది.
    Published by:Anil
    First published: