Karthika deepam-Premi Viswanath: ప్రేమి విశ్వనాథ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అన్నీ కూడా చీరకట్టులోనే.. అది కూడా ఒకే లొకేషన్లో ఉన్నాయి. ప్రస్తుతం తన స్వస్థలం కేరళలో ఉన్న ఈ బ్యూటీ.. శారీ ఫొటోషూట్ చేసింది.
వంటలక్క..! దీపక్క..! తెలుగింటి గృహిణిలకు పరిచయం అక్కర్లేని పేర్లు ఇవి. కార్తీక దీపం (Karthika Deepam) సీరియల్ ద్వారా అందరికీ ఇంటి మనిషి అయిపోయింది దీప. ఆ క్యారెక్టర్‌ను తెలుగు ప్రేక్షకులకు అంతగా ఆదరిస్తున్నారు. కార్తీక దీపం రేటింగ్‌కు బిగ్ బాస్ షో కాదు కదా.. పెద్ద పెద్ద సినిమాలు సైతం బీట్ చేయలేకపోయాయి. రేటింగ్ పరంగా అంతలా దూసుకెళ్తోంది కార్తీక దీపం. అందులో దీప క్యారక్టర్లో నటించిన ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath)కు తెలుగునాట పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. టాప్ సినిమా హీరోయిన్ స్థాయిలో ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. సీరియల్‌ను ఫాలో అవడతో పాటు ఆమె వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సోషల్ మీడియాలోనూ ప్రేమికి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.
తాజాగా ప్రేమి విశ్వనాథ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అన్నీ కూడా చీరకట్టులోనే.. అది కూడా ఒకే లొకేషన్లో ఉన్నాయి. ప్రస్తుతం తన స్వస్థలం కేరళలో ఉన్న ఈ బ్యూటీ.. శారీ ఫొటోషూట్ చేసింది. గంటకో చీర చొప్పున.. నాలుగు గంటల్లో నాలుగు చీరలను మార్చేసింది. రంగు రంగుల చీరల్లో మరింత కలర్ఫుల్గా కనిపించింది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.
ఐతే ఇవన్నీ ఏదో ఫంక్షన్ కోసమో..సినిమా షూటింగ్ కోసమో కాదు.. శారీ కలెక్షన్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా వేర్వేరు..రంగురంగుల.. చీరలు ధరించి సందడి చేసింది ప్రేమి విశ్వనాథ్. ఆ చీరల్లో చాలా అందగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.