PREMI VISWANATH KARTHIKA DEEPAM VANTALAKKA SHARES A BEAUTIFUL PIC WITH HER REEL DAUGHTER SK
Karthika Deepam: సండేరోజు స్పెషల్ పిక్‌తో.. ఫాన్స్‌ను ఖుషీ చేసిన వంటలక్క
వంటలక్క ( Photo : Star maa)
Karthika Deepam- Premi Viswanath: కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవుతోంది. తాజాగా మరో కొత్త ఫొటోను ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేసింది ప్రేమి విశ్వనాథ్.
కార్తీక దీపం (Karthika Deepam) వంటలక్క..! స్టార్ హీరోయిన్ రేంజ్లో ఈ సీరియల్ బ్యూటీకి ఫ్యాన్స్ ఉన్నారు. రాత్రి ఏడున్నర అయిందంటే చాలు గృహిణులంతా అన్నీ పనులను పక్కనబెట్టి టీవీలకు అతుక్కుపోతారు. వంటలక్కతో పాటు కన్నీళ్లు కార్చుతూ సీరియల్‌ను వీక్షిస్తున్నారు. ఈ దీపక్క కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటారు. అలా ప్రతి ఇంటి సభ్యురాలిగా మారిపోయింది ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath). అంతేకాదు కార్తీక దీపం రేటింగ్ కూడా మామూలుగా ఉండదు. భారీ సినిమాలు వచ్చినా.. బిగ్ బాస్ లాంటి షోలు ఎన్ని వచ్చినా.. కార్తీక దీపం ముందు దిగదుడుపే. మరే సీరియల్‌కు, రియాలిటీ షోకు సాధ్యంకానంత రేటింగ్ దూసుకెళ్తోంది వంటలక్క.
అందుకే కార్తీక దీపంలో దీపగా నటించిన ప్రేమి విశ్వనాథ్‌కు యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె సినిమా లైఫ్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఎంతో మంది అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ప్రేమి విశ్వనాథ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవుతోంది. తాజాగా మరో కొత్త ఫొటోను ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేసింది ప్రేమి విశ్వనాథ్. కార్తీక దీపంలో శౌర్య పాత్రలో నటిస్తున్న కృతికతో కలిసి సందడి చేసింది. ఆ అమ్మాయితో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది వంటలక్క.
కార్తీక దీపం సెట్లోనే ఆ ఫొటోను తీసుకున్నట్లు గెటప్‌ను చూస్తే అర్ధమవుతోంది. ఈ ఫొటోపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'క్యూట్ డాటర్.. బ్యూటిఫుల్ మదర్'.. అని కామెంట్స్ చేస్తున్నారు. బెస్ట్ ఆన్‌స్క్రీన్ మామ్ అండ్ డాటర్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.