Karthika Deepam: కార్తీకదీపం సీరియల్‌కు గుడ్ బై చెప్పిన వంటలక్క.. డాక్టర్ బాబుకు మోనితతో పెళ్లి?

karthika deepam

Karthika Deepam: ప్రస్తుతం బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

  • Share this:
    Karthika Deepam: ప్రస్తుతం బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇందులో దీప, కార్తీక్, సౌందర్య, మోనిత ల పాత్రలకు మంచి రెస్పాన్స్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ గురించి అందరికీ తెలిసిందే. దీప, కార్తీక్ లు మొత్తానికి కలుసుకునే సమయంలో మోనిత ప్రెగ్నెంట్ వార్త తో ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా పెళ్లి కూడా సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఈ సీరియల్ కు గుడ్ బై చెప్పేసింది వంటలక్క..

    ప్రస్తుతం కార్తీకదీపం అభిమానులు ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు. మోనితతో పెళ్లి నిజంగా జరుగుతుందా అని భయపడుతున్నారు. కానీ అలాగే జరుగుతుందేమో అని అనుమానాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే తాజాగా స్టార్ మా పరివార్ ఛాంపియన్ షిప్ ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. బుల్లితెరలో ఇప్పటివరకు జరగని సందడి ఒకేసారి 50 మంది కంటే ఎక్కువ టీవీ సెలబ్రిటీలతో త్వరలో సందడి కనిపించనుంది.



    అందులో ప్రతి ఒక్క సీరియల్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఇక ఈ షోకు యాంకర్ సుమ తో పాటు మరో గ్లామర్ బ్యూటీ శ్రీముఖి కూడా హోస్టింగ్ చేస్తున్నారు. ఇక ఇందులో 18 అదిరిపోయే పర్ఫామెన్స్ లతో సందడి చేయనున్నారు సెలబ్రెటీలు. ఇదంతా ఇలా ఉంటే ఇందులో కార్తీకదీపం సీరియల్ నటులు కూడా పాల్గొన్నారు. కానీ అందులో దీప రాకుండా మోనిత వచ్చింది. దీంతో ఈ ప్రోమోని చూసిన మన వంటలక్క అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. వంటలక్క బదులు మోనిత రావడంతో పలు అనుమానాలు బయటపెడుతున్నారు. వంటలక్క కార్తీక దీపం సీరియల్ కి గుడ్ బై చెప్పిందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా డాక్టర్ బాబు మోనితనే పెళ్లి చేసుకుంటాడేమో అని కొన్ని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి వంటలక్క ఈ షో కి ఎందుకు రాలేదు తెలియాల్సి ఉంది.
    Published by:Navya Reddy
    First published: