• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PREGNANT BEAUTY LISA HAYDON DROPS A FUN DANCE VIDEO WITH FRIENDS SK

Lisa Haydon: నిండు గర్భంతో హీరోయిన్ డాన్స్.. డిలీట్ కాక ముందే చూసేయండి..

Lisa Haydon: నిండు గర్భంతో హీరోయిన్ డాన్స్.. డిలీట్ కాక ముందే చూసేయండి..

లీసా హేడెన్ డాన్స్

Lisa Haydon | ఈ వీడియోను త్వరలో డిలీట్ చేయవచ్చని.. ఆ లోపు అందరూ చూసేయండని లీసా హేడెన్ పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ ఇసబెల్లా శ్రీమంతం సందర్భంగా.. వీరిద్దరితో పాటు మరో గర్భిణీ కూడా డాన్స్ చేశారు.

  • Share this:
    గర్భంతో ఉన్న వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు. డాక్టర్ల సలహా మేరకు చిన్న చిన్న వర్కవుట్స్ చేస్తారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తారు. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ.. కడుపులో తన బేబీ కదలికలను ఎంజాయ్ చేస్తూ.. మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ నటి, మోడల్ లీసా హేడెన్ కూడా ఇదే చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న ఈ బ్యూటీ.. మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఐతే గర్భంతో ఉన్న తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి.. లీసా హేడెన్ ఇటీవల డాన్స్ చేసి సందడి చేసింది.. ముగ్గురూ కలిని నడుమును తిప్పుతూ డాన్స్ అదరగొట్టారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది లీసా హేడెన్.

    ఈ వీడియోను త్వరలో డిలీట్ చేయవచ్చని.. ఆ లోపు అందరూ చూసేయండని లీసా హేడెన్ పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ ఇసబెల్లా శ్రీమంతం సందర్భంగా.. వీరిద్దరితో పాటు మరో గర్భిణీ కూడా డాన్స్ చేశారు. బేబీ షవర్ రోజున అందరిలా కేకులు ఇవ్వకుండా.. ఇలా డాన్స్‌తో సెలబ్రేట్ చేసుకున్నందుకు సంతోషంగా ఉందని ఇన్‌స్టగ్రామ్‌లో పేర్కొంది లీసా హేడెన్.








    View this post on Instagram






    A post shared by Lisa Lalvani (@lisahaydon)






    2010లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన లీసా హేడెన్ ఇప్పటి వరకు 8 చిత్రాల్లో నటించింది. చివరగా 2016లో ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో మెరిసింది. తెలుగులో రామ్ చరణ్ సరసన రచ్చ మూవీలో రచ్చ రచ్చచేసింది హేడెన్. పలు రియాలిటీ షోలకు జడ్జిగా కూడా ఆమె వ్యవహరించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు