సైరా మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌పై కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ నెలకొంది. మొదట ముంబైలో అనుకున్నారు. కానీ సెట్ కాలేదు. ఆ తర్వాత కర్నూల్లో ప్లాన్ చేద్దామనుకున్నారు. అది కూడా వర్కవుట్ కాలేదు. దాంతో చివరకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సెప్టెంబర్ 18న సైరా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఖరారు చేసింది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఐతే ఈసారి కూడా ప్రిరిలీజ్ వేడుక వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో సెప్టెంబర్ 22కి వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. దాంతో మెగా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఐతే ట్రైలర్‌ని మాత్రం రేపు విడుదల చేస్తామని తెలిపారు.

సెప్టెంబరు 18న వాతావరణం అనుకూలించదన్న అంచనాల నేపథ్యంలో సైరా ప్రి రిలీజ్ వేడుకను సెప్టెంబరు 22కి వాయిదా వేస్తున్నాం. ట్రైలర్‌ను మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం బుధవారమే విడుదల చేస్తాం.
— కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
సైరా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు కేటీఆర్ వస్తారని వస్తారని మొదట ప్రచారం జరిగింది. ఐతే ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఆయన రావడం లేదని మూవీ బృందం ప్రకటించింది. ప్రిరిలీజ్ ఈవెంట్ ఆదివారానికి వాయిదా పడడంతో మరి కేటీఆర్ వస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. సైరా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకులు రాజమౌళి, శివ కొరటాల, వివి వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
సైరా మూవీలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయన తార, అనుష్క, తమన్నా వంటి అగ్ర సినీ నటులు నటించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీపై శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్ వర్గాలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. రేపు ట్రైలర్ విడుదల కానుంది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయబోతున్నారు.