సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే వసూళ్లలో కూడా దూకుడు చూపించాడు సుప్రీమ్ హీరో. మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దాదాపు 800 స్క్రీన్స్‌లో విడుదలైంది. తొలిరోజు దాదాపు 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ప్రతిరోజూ పండగే రెండో రోజు నుంచి కూడా అదే దూకుడు చూపించింది. విడుదలై నెల రోజుల కూడా పూర్తి కావడంతో ఫుల్ రన్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఈ చిత్రం నెల రోజుల్లో 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది.
సంక్రాంతి వరకు సినిమాలేవీ రాకపోవడంతో మూడు వారాల పాటు ఈ చిత్రం కుమ్మేసింది. రాశి ఖన్నా, రావు రమేష్ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఎమోషనల్ ఎంటర్టైనర్గా మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం సాయి కోరుకున్న బ్రేక్ ఇచ్చింది. నైజాంలో సాయి తేజ్‌కు ఉన్న మార్కెట్ మరోసారి ప్రూవ్ అయింది. ఇక్కడ బాలయ్య రూలర్ సినిమాను పూర్తిగా డామినేట్ చేసాడు సాయి. ఫుల్ రన్లో ఇక్కడ 12 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. రూలర్, దొంగ ఫ్లాప్ కావడంతో సాయి నిజంగానే థియేటర్స్ దగ్గర ప్రతిరోజూ పండగే చేసుకున్నాడు. మొత్తానికి చిత్రలహరి తర్వాత మరోసారి 2019లో సత్తా చూపించాడు సుప్రీమ్ హీరో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PratiRoju Pandaage, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood