సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమాకు మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే వసూళ్లలో కూడా దూకుడు చూపిస్తున్నాడు ఈ సుప్రీమ్ హీరో. మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దాదాపు 800 స్క్రీన్స్‌లో విడుదలైంది. తొలిరోజు దాదాపు 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ప్రతిరోజూ పండగే రెండో రోజు కూడా అదే దూకుడు చూపించింది. ఈ చిత్రం రెండో రోజు కూడా 3 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చిందని తెలుస్తుంది. రాశి ఖన్నా, రావు రమేష్ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
ఎమోషనల్ ఎంటర్టైనర్గా మారుతి తెరకెక్కించిన ఈ చిత్రానికి రానురాను వసూళ్లు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. నైజాంలో సాయి తేజ్‌కు ఉన్న మార్కెట్ మరోసారి ప్రూవ్ అయింది. ఇక్కడ బాలయ్య రూలర్ సినిమాను పూర్తిగా డామినేట్ చేస్తున్నాడు సాయి. తొలిరోజే కోటిన్నర వరకు తీసుకొచ్చిన ఈయన రెండో రోజు కూడా బాగానే వసూలు చేసాడు. డీసెంట్ టాక్ ఉండటం.. క్రిస్మస్ హాలీవుడ్ కలిసిరావడంతో వీకెండ్ అయ్యేనాటికి వసూళ్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నారు మేకర్స్. రూలర్ నెగిటివ్ టాక్ ఉండటం.. దొంగ స్లో పికప్ కారణంగా సాయి తేజ్ పండగ చేసుకుంటున్నాడు. మొత్తానికి చిత్రలహరి తర్వాత మరోసారి 2019లో సత్తా చూపించాడు సుప్రీమ్ హీరో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood