ఆ సినిమాలో అతని నటనకు చిరంజీవి ఫిదా.. వెంటనే కలవాలని..

మెగాస్టార్‌తో ఇప్పటికీ తనకు సత్సంబంధాలు ఉన్నాయని.. అప్పుడప్పుడు కలుస్తుంటానని తెలిపారు. చిరంజీవితో నటించినట్టే భవిష్యత్‌లో రాంచరణ్‌తో నటించాలనకుంటున్నట్టు చెప్పారు.

news18-telugu
Updated: October 20, 2019, 2:52 PM IST
ఆ సినిమాలో అతని నటనకు చిరంజీవి ఫిదా.. వెంటనే కలవాలని..
మెగాస్టార్ చిరంజీవి (File Photo)
  • Share this:
దర్శకుడు టి.కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో 1986లో వచ్చిన ప్రతిఘటన చిత్రం అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో విజయశాంతికి ఎంత పేరు వచ్చిందో.. ప్రతినాయకుడిగా నటించిన చరణ్ రాజ్‌కు కూడా అంతే గుర్తింపు వచ్చింది. అప్పటిదాకా కన్నడ సినిమాల్లో హీరోగా చేస్తోన్న చరణ్ రాజ్.. ప్రతిఘటనతో తెలుగు తెరకు విలన్‌గా పరిచయమయ్యారు. అప్పట్లో ఈ సినిమా చూసిన చిరంజీవి.. ఇందులో చరణ్ రాజ్ నటనకు ముగ్దుడైపోయాడట.

ఆ సమయంలో బెంగళూరులో షూటింగ్‌ చేస్తోన్న చిరంజీవి.. వెంటనే చరణ్ రాజ్‌ను కలవాలనుకున్నారట. ఇదే విషయం నటుడు టైగర్ ప్రభాకర్‌తో చెప్పారట. టైగర్ ప్రభాకర్-చరణ్ రాజ్ ఇద్దరు కలిసి ఓ కన్నడ సినిమాలో నటిస్తుండటంతో.. ఓరోజు ప్రభాకర్ చరణ్‌తో చిరంజీవి గురించి చెప్పారట. అలా ఓరోజు టైగర్ ప్రభాకర్ చరణ్ రాజ్‌ను చిరంజీవి వద్దకు తీసుకెళ్లారట. చరణ్ రాజ్‌ను చూసి.. ప్రతిఘటనలో నటించింది ఈయనేనా..? అని కాస్త ఆశ్చర్యంగా ప్రభాకర్‌ని అడిగారట. అప్పట్లో తనకు తెలియదని.. ఆ తర్వాత చిరంజీవి ఏమన్నారో తెలుసుకుని నవ్వుకున్నానని చరణ్ రాజ్ తెలిపారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.మెగాస్టార్ అలా తనను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడటం ఎప్పటికీ మరిచిపోనని చరణ్ రాజ్ అన్నారు. మెగాస్టార్‌తో ఇప్పటికీ తనకు సత్సంబంధాలు ఉన్నాయని.. అప్పుడప్పుడు కలుస్తుంటానని తెలిపారు. చిరంజీవితో నటించినట్టే భవిష్యత్‌లో రాంచరణ్‌తో నటించాలనకుంటున్నట్టు చెప్పారు.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading