Prashanth Varma - Zambi Reddy Movie: జాంబీలకు, కరోనా వైరస్‌కు లింకేంటి?

జాంబీ రెడ్డి ఫస్ట్ బైట్

Prashanth Varma - Zambi Reddy Movie: జాంబీ జోనర్ లో ప్రశాంత్‌ వర్మ రూపొందిస్తోన్న 'జాంబీరెడ్డి' ఫస్ట్‌ బైట్‌ను సమంత అక్కినేని విడుదల చేశారు

  • Share this:
    అవును.. జాంబీలకు, కరోనా వైరస్‌కు లింకేంటి? అనే సందేహం రాక మానదు. కానీ ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే తన సినిమా చూడాలంటున్నాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. మనిషి మేధస్సుని ప్రశ్నిస్తూ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం 'జాంబీరెడ్డి'. జాంబీ జోనర్‌లో కర్నూలు బ్యాక్‌డ్రాప్‌తో సినిమాను ఈ డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్నారు. అ!, కల్కి చిత్రాలు తర్వాత ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రానున్న చిత్రమిది. త్వరలోనే ఈ సినిమా విడుదలపై క్లారిటీ రానుంది. కాగా ఈ సినిమా కథకు కరోనా వైరస్‌ లింకు పెడుతూ ప్రశాంత్‌ వర్మ సినిమాను తెరకెక్కించడమే విశేషం. ఆసక్తికరమైన విషయమేమంటే.. కరోనా వైరస్‌ ప్రభావం ప్రారంభం కాక మునుపే ఈ డైరెక్టర్‌ ఈ కథాంశంతో సినిమాను స్టార్ట్‌ చేయడం. అసలు జాంజీలకు, కరోనా వైరస్‌కు ఉన్న లింకేంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. రీసెంట్‌గా విడుదలైన 'జాంబీరెడ్డి' ఫస్ట్‌ బైట్‌ చాలా ఆసక్తికరంగా ఉంది.

    "దైవం మనుష్య రూపేణ అనేది ఇతిహాసం.. రాక్షసం మనుష్య రూపేణ అనేది ప్రస్తుతం. భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషికి మేధాశక్తిని ఇవ్వడం. ఆ మేధా శక్తి తనకే ఓ ప్రశ్నగా నిలిస్తే, దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం" అంటూ ఫస్ట్‌ బైట్‌లో వచ్చే డైలాగ్స్‌తో పాటు కోవిడ్‌ ఇంజెక్షన్స్‌ను చూపించి జాంబీలకు, కరోనా వైరస్‌కు ఏదో లింకుంది? అనే ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో ప్రశాంత్‌ వర్మ సక్సెస్‌ అయ్యాడనిపించింది. మరి సినిమా చూస్తే కానీ అసలు విషయం తెలియదు. తేజా సజ్జా, ఆనంది, దక్షా నగార్‌కర్‌ ఇందులో హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు




    నాని నిర్మాతగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అ!' సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాదండోయ్‌ అవార్డులను కూడా దక్కించుకుంది. ప్రశాంత్‌తో సినిమాలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపారు. ఆ క్రమంలో రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన 'కల్కి' సినిమా మాత్రం డిజాస్టర్‌ అయ్యింది. దీంతో ప్రశాంత్‌ వర్మకు డైరెక్టర్‌గా అవకాశాలు రాలేదు. అదే సమయంలో అ! సీక్వెల్‌ చేయడానికి కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేయడానికి కాజల్‌ అగర్వాల్‌ కూడా రెడీ అయ్యింది. అయితే ఏమైందో ఏమో కానీ ప్రాజెక్ట్‌ నుండి కాజల్‌ డ్రాప్‌ అయ్యింది. ఆ తర్వాత ప్రశాంత్‌ వర్మ 'జాంబీరెడ్డి' సినిమా తెరకెక్కించే పనిలో పడ్డాడు. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌ శేఖర్‌ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
    Published by:Anil
    First published: