Home /News /movies /

Prashanth Varma - Hanuman : ’జాంబీ రెడ్డి’ తర్వాత ‘హనుమాన్’ సినిమాతో పలకరించనున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..

Prashanth Varma - Hanuman : ’జాంబీ రెడ్డి’ తర్వాత ‘హనుమాన్’ సినిమాతో పలకరించనున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..

‘హనుమాన్’ టైటిల్‌తో ప్రశాంత్ వర్మ కొత్త సినిమా (Twitter/Photo)

‘హనుమాన్’ టైటిల్‌తో ప్రశాంత్ వర్మ కొత్త సినిమా (Twitter/Photo)

Prashanth Varma - Hanuman : టాలీవుడ్‌లో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా ఈయన జాంబీ రెడ్డి తర్వాత హనుమాన్ పేరుతో మరో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.

  Prashanth Varma - Hanuman : ’జాంబీ రెడ్డి’ (Zombie Reddy) తర్వాత ‘హనుమాన్’ (Hanuman) సినిమాతో పలకరించనున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ వర్మ.. తెలుగులో రొటీన్‌కు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫస్ట్ మూవీ ‘అ’ తోనే అందరినీ ఆశ్చర్యచకితులను చేసి జాతీయ అవార్డు సైతం అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాజల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ అతనికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ చిత్రానికి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో తెలియజేసారు. ‘అ’ సినిమా తర్వాత రాజశేఖర్ (RajaSekhar) హీరోగా ‘కల్కి’ (Kalki)చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ సినిమా పెద్దగా అలరించలేకపోయినా.. ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈయన ప్రస్తుతం తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ  సినిమా విడుదలకు రెడీగా ఉంది.

  ఐతే.. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పటికీ ఆ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించింది.  ఆ తర్వాత ప్రశాంత్ వర్మ.. ’జాంబీ రెడ్డి’ సినిమా తెరకెక్కించారు. తేజ సజ్జ హీరోగా దక్ష నగార్కర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

  కరోనాను బ్యాగ్ గ్రౌండ్‌లో తీసుకుని జాంబి రెడ్డి (Zombie Reddy) సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కూడా జోడించడంతో సినిమాలో నవ్వులు పువ్వులు పూసాయి. కామెడీ ఓ రేంజ్‌లో పేలింది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన అందులోనే కామెడీ కూడా వర్కవుట్ చేయడంతో జనాలను బాగానే ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. రూ. 4 కోట్ల బడ్జెట్‌తో రూపోందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.  15 కోట్ల వరకు వసూలు చేసింది.

  బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

  చిన్న సినిమాగా వచ్చిన టాక్ బాగుండడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి నందినీ (Nandini), ఢిల్లీ బ్యూటీ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా నటించారు. గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ (Zombie Reddy Sequel ) తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  అది అలా ఉంటే ఈ సినిమా 'జాంబి జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా. ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా కొనుగోలు చేసంది. కాగా ఈ సినిమా మొదటిసారి స్టార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ప్రసారం చేస్తే ఏకంగా 9.7 టీఆర్పీ వచ్చింది.  రెండో సారి కూడా టెలివిజన్‌లో టెలికాస్ట్ చేస్తే.. అపుడు కూడా 8.1 టీర్పీ సాధించింది. ఇక మూడోసారి ఈ సినిమా 7.42 టీఆర్పీ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా తేజ్ హీరోగా ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

  ’హనుమాన్’ టైటిల్‌తో ప్రశాంత్ వర్మ కొత్త చిత్రం (Twitter/Photo)


  దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మన  పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అంజనాద్రి ప్రపంచంలోకి ప్రయాణం.. హను - మాన్ నుంచి హనుమంతుని పరిచయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన మరో అప్టేట్‌ను ఈ శనివారం 18వ తేదిన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Hanuman Movie, Prashanth Varma, Teja Sajja, Tollywood

  తదుపరి వార్తలు