Home /News /movies /

PRASHANTH VARMA NEW MOVIE HANUMAN FIRST LOOK STUNNING GOES VIRAL SR

Prashanth Varma - Hanuman : అదిరిన హనుమాన్ ఫస్ట్ లుక్.. ప్రశాంత్ వర్మ తన మార్క్‌ చూపించారు..

Hanuman First Look Photo : Twitter

Hanuman First Look Photo : Twitter

Prashanth Varma: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం హనుమాన్.. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...
    ప్రశాంత్ వర్మ ’జాంబీ రెడ్డి’ (Zombie Reddy) తర్వాత ‘హనుమాన్’ (Hanuman) సినిమాతో పలకరించనున్నారు.  తెలుగులో రొటీన్‌కు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ యువ దర్శకుడు. ఫస్ట్ మూవీ ‘అ’ తోనే అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతేకాదు ఈ సినిమాకు జాతీయ అవార్డు సైతం అందుకున్నారు ప్రశాంత్ వర్మ. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ అతనికి మంచి పేరే తెచ్చిపెట్టింది. నాని నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో తెలియజేసారు. ‘అ’ సినిమా తర్వాత రాజశేఖర్ (RajaSekhar) హీరోగా ‘కల్కి’ (Kalki)చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ సినిమా పెద్దగా అలరించలేకపోయినా.. ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈయన ప్రస్తుతం తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ  సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

    ఈ సినిమా హిందీ సినిమా క్విన్ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చింది.  కరోనా కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పటికీ ఆ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించింది.  ఆ తర్వాత ప్రశాంత్ వర్మ.. ’జాంబీ రెడ్డి’ సినిమా తెరకెక్కించారు. తేజ సజ్జ హీరోగా దక్ష నగార్కర్,  (Daksha Nagarkar) ఆనందీ హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది.



    కరోనాను బ్యాగ్ గ్రౌండ్‌లో తీసుకుని జాంబీ రెడ్డి (Zombie Reddy) సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కూడా జోడించడంతో సినిమాలో నవ్వులు పువ్వులు పూసాయి. కామెడీ ఓ రేంజ్‌లో పేలింది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన అందులోనే కామెడీ కూడా వర్కవుట్ చేయడంతో జనాలను బాగానే ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. రూ. 4 కోట్ల బడ్జెట్‌తో రూపోందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.  15 కోట్ల వరకు వసూలు చేసింది.

    Allu Arjun : అల వైకుంఠపురములో సినిమాకు ఐదు అవార్డులు.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్..

    అది అలా ఉంటే తేజ సజ్జ (Teja sajja) హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’. మొదటి భారతీయ సూపర్ హీరో చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్’ను (Hanuman First Look) విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించించి చిత్రబృందం.

    Gopichand | Seetimaarr : రెండవ వారంలో సీటీమార్.. ఎనిమిదో రోజు ఎంత వసూలు చేసిందంటే..

    ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో అదిరిపోయిందనే చెప్పోచ్చు. ఆ వీడియో విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. చూడాలి మరి సినిమా ఎలా ఉండనుందో.. ఇక ఈ సినిమాలో హీరోగా చేస్తున్న తేజా సజ్జా బాల నటుడిగా పరిచయమే.. ఆయన ఇంద్ర వంటి సినిమాల్లో నటించి అదరగొట్టారు.

    ఇక తేజ సజ్జా నటించిన మరో చిత్రం ఇష్క్. ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా ప్రకాష్ వారియర్‌ (Priya Prakash Varrier నటించింది).
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Hanuman Movie, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు