Prabhas Salaar: ప్రభాస్ ‘సలార్’ కథ లీక్.. 15 ఏళ్ళ నాటి రాజమౌళి సినిమాను ఫాలో అవుతున్న ప్రశాంత్ నీల్..

సలార్: హీరో: ప్రభాస్, దర్శకుడు: ప్రశాంత్ నీల్

Prabhas Salaar: ప్రశాంత్ నీల్-ప్రభాస్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ కాంబినేషన్‌పై చర్చ జరుగుతుంది. ఎలాంటి సినిమా ఈ కాంబోలో రాబోతుందో అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఛత్రపతి సినిమాకు..

  • Share this:
ప్రశాంత్ నీల్-ప్రభాస్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ కాంబినేషన్‌పై చర్చ జరుగుతుంది. ఎలాంటి సినిమా ఈ కాంబోలో రాబోతుందో అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఛత్రపతి సినిమాకు ముందు వరకు కూడా ప్రభాస్ కేవలం ఓ హీరో మాత్రమే. ఆయనకు వర్షం లాంటి విజయం వచ్చినా కూడా మాస్ ఇమేజ్ మాత్రం రాలేదు. కోరుకున్న మార్కెట్ కూడా క్రియేట్ కాలేదు. అలాంటి సమయంలో రాజమౌళి వచ్చి చత్రపతి సినిమాతో ప్రభాస్ రేంజ్ మార్చేసాడు. అప్పటి వరకు ఉన్న మార్కెట్‌ను మూడింతలు పెంచేసాడు. అన్నింటి కంటే ముందు ప్రభాస్‌కు ఫ్యాన్ బేస్ పెంచేసాడు. మాస్‌లో ఆయనకు విపరీతమైన ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఛత్రపతి. అందులో అనామకుడిగా ఉన్న వాడు నాయకుడిగా ఎలా మారాడు అనేది కథ. దానికి శ్రీలంక శరణార్థుల నేపథ్యం తీసుకున్నాడు ప్రభాస్. ఛత్రపతి తర్వాత ప్రభాస్ చాలా సినిమాలు చేసాడు కానీ అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా మాత్రం రాలేదు. బాహుబలి కూడా చరిత్ర సృష్టించింది కానీ ఛత్రపతి సృస్టించిన ఆ మ్యాజిక్ అభిమానుల్లో కలిగించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి అలాంటి సంచలన సినిమాతో రాబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం అనే కన్నడ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్.. కెజియఫ్ సినిమాతో తనేంటో చూపించాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈయన కోసం చూస్తున్నారు స్టార్ హీరోలు. కెజియఫ్ 2 విడుదలకు ముందే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సలార్ లాంటి మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు తెరతీసాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం, కెజియఫ్ సినిమా కథలు వేరుగా ఉంటాయి కానీ మూలకథ మాత్రం ఒక్కటే.

prabhas,prabhas salaar movie,prabhas salaar movie story,prabhas salaar movie story revealed prashanth neel,prashanth neel prabhas movie,salaar movie story backdrop revealed,ప్రభాస్,సలార్ సినిమా బ్యాక్‌డ్రాప్,ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమా
ఛత్రపతి (Prabhas Chatrapathi)


అదే అనామకుడిగా ఉన్న వాడు ఉన్నట్లుండి నాయకుడు కావడం. ఇప్పుడు సలార్ సినిమాలో కూడా ఇలాంటి కథనే చెప్పబోతున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని అర్థం చెప్పాడు ఈ దర్శకుడు. తన సినిమాలో గ్రూపులో కుడిభుజంలా ఉండేవాడు.. లీడర్ ఎలా అయ్యాడు అనేది కథ అని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఎవ్వరూ చూపించని స్థాయిలో.. అంత పవర్ ఫుల్‌గా ఇందులో చూపించబోతున్నట్లు తెలిపాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి కూడా. 2022, ఎప్రిల్ 14న సినిమా విడుదల కానుంది.

prabhas,prabhas salaar movie,prabhas salaar movie story,prabhas salaar movie story revealed prashanth neel,prashanth neel prabhas movie,salaar movie story backdrop revealed,ప్రభాస్,సలార్ సినిమా బ్యాక్‌డ్రాప్,ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమా
ప్రభాస్,ప్రశాంత్ నీల్ (Twitter/Photo)


ఇందులో గ్యాంగ్ లీడర్‌గా కనిపించబోయే ప్రభాస్‌కు రివేంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ముంబై మాఫియాను కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కెజియఫ్‌లో కూడా ముంబై మాఫియా ఉంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్‌లో బాలీవుడ్ నటులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఉగ్రం రీమేక్ అనే ప్రచారం కూడా జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: