HOME »NEWS »MOVIE »prashanth neel clarifies about his next movie with jr ntr or prabhas after completes kgf2 movie ta

Prashanth Neel: ప్రశాంత్ నీల్ నెక్ట్స్ సినిమాలో హీరో ఎన్టీఆర్ లేక ప్రభాస్.. క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్..

Prashanth Neel: ప్రశాంత్ నీల్ నెక్ట్స్ సినిమాలో హీరో ఎన్టీఆర్ లేక ప్రభాస్.. క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్..
ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్,ప్రభాస్ (File/Photos)

గత కొన్నేళ్లులలో దక్షిణాది దర్శకులు శంకర్, రాజమౌళి తర్వాత దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్, ప్రభాస్‌లలో ఎవరితో నెక్ట్స్ సినిమా చేస్తాడనే దానిపై క్లారిటీ ఇచ్చారు.

  • Share this:
    గత కొన్నేళ్లులలో దక్షిణాది దర్శకులు శంకర్, రాజమౌళి తర్వాత దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. అంతకు ముందు మణిరత్నం కూడా తన సినిమాలతో ఆల్ ఇండియా ప్రేక్షకులను తన సినిమాలతో అలరించారు. ఒకపుడు ఆదుర్తి సుబ్బారావు, దాసరి, రాఘవేంద్రరావు, బాపయ్య వంటి చాలా మంది తెలుగు దర్శకులు హిందీ సినిమాలను డైరెక్ట్ చేసి తమ సత్తా చాటారు. మలయాళం నుంచి ప్రియదర్శన్ కూడా హిందీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి ఎపుడైతే.. బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా మూవీ చేసి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను  ఆకట్టుకున్నాడు. జక్కన్న కూడా బాహుబలికి అన్ని భాషల్లో ఈ రకంగా రెస్పాన్స్ వస్తుందని కూడా ఊహించలేదు. అంతేకాదు ఒక ప్రాంతీయ భాష చిత్రం హిందీలో దాదాపు రూ. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం బాలీవుడ్ మేధావులను సైతం ఆశ్యర్యపోయేలా చేసింది.ఒకవైపు రాజమౌళి బాహుబలి వంటి సినిమాతో బాలీవుడ్ చిత్ర సీమను శాసిస్తుంటే.. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్.. యశ్ వంటి అప్ కమింగ్ హీరోతో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ సినిమా తెరకెక్కించి అద్భుతమైన విజయం సాధించాడు.

    happy birthday prashanth neel these are the specialities of director,prashanth neel,prashanth neel kgf,prashanth neel kgf 2,prashanth neel jr ntr,prashanth neel prabhas,prashanth neel mahesh babu,prashanth neel yash,yash kgf 2,prashanth neel twitter,prashanth neel instagram,prashanth neel movies,director prashanth neel,hbd prashanth neel,yash prashanth neel,prashanth neel first movie,prashanth neel telugu movie,happy birthday prashanth neel,director prashanth neel speech,director prashanth neel speaks,kgf director prashanth neel movie,happy birthda y prashant neel,prashanth neel blockbuster movies,prashanth neel at #kgf trailer launch,director prashanth neel on baahubali,prashanth neel hit and flop movies list,prashanth neel highest grossing movie,ప్రశాంత్ నీల్,దర్శకుడు ప్రశాంత్ నీల్ బర్త్ డే,ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ యశ్,ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ మహేష్ బాబు,ప్రశాంత్ నీల్ ప్రభాస్,ప్రశాంత్ నీల్ సినిమాలు
    కెజియఫ్ 2 (KGF Chapter 2 release date)




    అంతకు ముందు ప్రశాంత్ నీల్ కేవలం ఒకే ఒక సినిమాను తెరకెక్కించాడు.  కేజీఎఫ్ సినిమా కూడా ఎవరు ఊహించని విధంగా కన్నడతో పాటు తెలుగులో హిందీలో ఓ రేంజ్‌లో ఇరగదీసింది. అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్‌లోనే ఏకంగా రూ. 125 కోట్ల వరకు కొల్లగొట్టింది. తెలుగులో రూ. 3 కోట్ల లోపు బిజినెస్ చేసిన ఈ సినిమా మొత్తంగా రూ. 25 కోట్ల వరకు కొల్లగొట్టి అందరి ఆశ్యర్యపోయేలా చేసింది. అంతేకాదు కన్నడ చిత్రపరిశ్రమలో తొలి రూ.100 కోట్లు, తొలి రూ. 200 కోట్ల సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చిత్రంతో హీరోగా యశ్‌తో పాటు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా పాపులర్ ఫిగర్స్  అయిపోయారు.

    ప్రశాంత్ నీల్ (Twitter/Photo)


    ఇపుడు ఇతను యశ్‌తో ‘కేజీఎఎఫ్ 2’ పార్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూసేలా చేసాడు. రెండో పార్ట్‌లో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ నటీనటులు నటిస్తుండటం విశేషం. కరోనా లాక్‌డౌన్ తర్వాత రీసెంట్‌‌గా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.

    కేజీఎఫ్ 2 షూటింగ్‌లో యశ్‌కు సలహాలు ఇస్తున్న ప్రశాంత్ నీల్ (Twitter/Photo)


    ఐతే.. రీసెంట్‌గా ట్విట్టర్‌లో చేసిన చిట్‌చాట్‌లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తెలుగులో చేయనున్నట్టు ప్రకటించాడు. ఐతే.. ముందుగా ఎన్టీఆర్, ప్రభాస్ ఎవరితో చేస్తాడనేదానికి ముందుగా కేజీఎఫ్ 2 కంప్లీటైన తర్వాత అఫీషియల్‌గా ప్రకటిస్తానని చెప్పాడు.



    కన్నడ చిత్ర సీమలో పుట్టన్న కనగల్, గిరీష్ కాసరవల్లి, ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు తర్వాత ఆ రేంజ్‌లో ఫేమసైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్.. వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కమిటయ్యాడు. ముందు ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం కూడా కేజీఎఫ్ తరహాలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. కేజీఎఫ్ తర్వాత ముందుగా ఎన్టీఆర్‌తో చేసే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్‌తో చేసే అవకాశాలున్నాయి.

    Ntr news,NTR to work with prashanth neel, Janhvi kapoor to romance with tarak , Ntr trivikram new film, pooja hegde,ntr,jr ntr,jr ntr politics,jr ntr tdp politics,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్,పూజాహెగ్డే, ప్రశాంత్ నీల్
    ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ Photo : Twitter


    ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రాన్ని స్వాతంత్య్రం తర్వాత భారత్- పాకిస్థాన్ విడిపోయిన కాలం నాటి నుంచి ఆ తర్వాత భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ యుద్ధంలో మన భారత యోధులు ఏ విధంగా పోరాటం చేసారనే ఇతివృత్తంతో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. (ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నారు. మరోవైపు ప్రభాస్‌తో కూడా ప్రశాంత్ నీల్ నెక్ట్స్ మూవీ ఉండే అవకాశాలున్నాయి.

    prabhas and prashant neel ff
    ప్రభాస్, ప్రశాంత్ నీల్ Photo : Twitter


    నాగ్ అశ్విన్, ఓం రౌత్ ‘ఆదిపురుష్’  సినిమాల తర్వాత ప్రభాస్ చిత్రాన్ని ఇతనే డైరెక్ట్ చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్నట్టు సమాచారం.వీళ్లిద్దరి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఓ చిత్రం చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. మొత్తంగా కేజీఎఫ్ తర్వాత దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఖ్యాతి మరింత పెరిగింది.  ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ తెలుగు హీరోలతో సినిమాలు చేయడాన్ని కన్నడ ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్, రాజమౌళి వాళ్ల భాషలో ఉన్న హీరోలతో సినిమాలు తెరకెక్కించి ఫేమస్ అయ్యారు. అలాగే ప్రశాంత్ నీల్ కూడా కన్నడ హీరోలతోనే సినిమాలు తెరకెక్కించాలని పట్టుపడుతున్నారు. మొత్తంగా ప్రశాంత్ నీల్ ఇపుడు కన్నడ డైరెక్టర్ కాదు.. రాజమౌళి లెవల్లో ప్యాన్ ఇండియా లెవల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:October 13, 2020, 08:13 IST