Ram Charan | Prashanth Neel : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్.. ఇదేమి లైన్ అప్.. మామూలుగా లేదుగా...

Ram Charan, Prashanth Neel, Danayya Photo : Twitter

Ram Charan | Prashanth Neel : రామ్ చరణ్ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాకు ఓకే అన్నట్లు టాక్ రాగా.. తాజాగా దసరా సందర్భంగా రామ్ చరణ్ ఇంట్లో ప్రశాంత్ నీల్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈ సినిమా విషయంలో మరింత క్లారిటీ వచ్చింది.

  • Share this:
    రామ్ చరణ్  (Ram Charan) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇక అది అలా ఉంటే రామ్ చరణ్ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాకు ఓకే అన్నట్లు టాక్ రాగా.. తాజాగా దసరా సందర్భంగా రామ్ చరణ్ ఇంట్లో ప్రశాంత్ నీల్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈ సినిమా విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ప్రశాంత్ మరో వైపు ప్రభాస్‌తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను రూపోందించనున్నారు. ఈ సినిమా తర్వాత బహుశా రామ్ చరణ్ సినిమా ఉండోచ్చని అంటున్నారు.

    ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. దసరా సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుంది.

    Suriya : దొంగలు మీ జాతిలోను ఉంటారు.. అదిరిన సూర్య జై భీమ్ టీజర్.. నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్..

    రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. రౌద్రం రణం రుథిరం పేరుతో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ (Ram Charan)తో పాటు (NTR) ఎన్టీఆర్ నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.



    వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ (Alia Bhatt) నటిస్తున్నారు. ఇక సెకండ్ వేవ్ కరోనా కేసులు తగ్గడంతో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా... ఆ విడుదలను (RRR Release Date) మరోసారి వాయిదా వేసింది చిత్రబృందం.


    ఈ సినిమాను జనవరి 7న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

    Anchor Anasuya : ప్రియమైనవారితో కారులో అనసూయ దసరా సంబరాలు.. వైరల్ అవుతోన్న పిక్స్..

    రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.  ఈ సినిమాలతో పాటు రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్యలో కూడా నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: