Home /News /movies /

PRASANTH VARMA TEJA SAJJA LATEST HANUMAN MOVIE LAST SCHEDULE STARTS TODAY TA

Prasanth Varma - Hanuman : ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం (Twitter/Photo)

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం (Twitter/Photo)

Prashanth Varma: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం హనుమాన్.. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం లాస్ట్ షెడ్యూల్ ఈ రోజు (సోమ వారం) ప్రారంభమైంది.

ఇంకా చదవండి ...
  Prasanth Varma - Hanuman : ప్రశాంత్ వర్మ ’జాంబీ రెడ్డి’ (Zombie Reddy) తర్వాత ‘హనుమాన్’ (Hanuman) సినిమాతో పలకరించనున్నారు.  తెలుగులో రొటీన్‌కు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ యువ దర్శకుడు. ఫస్ట్ మూవీ ‘అ’ తోనే అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతేకాదు ఈ సినిమాకు జాతీయ అవార్డు సైతం అందుకున్నారు ప్రశాంత్ వర్మ. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ అతనికి మంచి పేరే తెచ్చిపెట్టింది. నాని నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో తెలియజేసారు. ‘అ’ సినిమా తర్వాత రాజశేఖర్ (RajaSekhar) హీరోగా ‘కల్కి’ (Kalki)చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ సినిమా పెద్దగా అలరించలేకపోయినా.. ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈయన ప్రస్తుతం తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ  సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

  ఈ సినిమా హిందీ సినిమా క్విన్ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చింది.  కరోనా కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పటికీ ఆ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించింది.  ఆ తర్వాత ప్రశాంత్ వర్మ.. ’జాంబీ రెడ్డి’ సినిమా తెరకెక్కించారు. తేజ సజ్జ హీరోగా దక్ష నగార్కర్,  (Daksha Nagarkar) ఆనందీ హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది.

  NBK- Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ మరో సెన్సేషనల్ రికార్డు.. హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్‌ రోడ్‌లో రూ. కోటి కలెక్ట్ చేసిన మూవీ..

  కరోనాను బ్యాగ్ గ్రౌండ్‌లో తీసుకుని జాంబీ రెడ్డి (Zombie Reddy) సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కూడా జోడించడంతో సినిమాలో నవ్వులు పువ్వులు పూసాయి. కామెడీ ఓ రేంజ్‌లో పేలింది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన అందులోనే కామెడీ కూడా వర్కవుట్ చేయడంతో జనాలను బాగానే ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. రూ. 4 కోట్ల బడ్జెట్‌తో రూపోందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.  15 కోట్ల వరకు వసూలు చేసింది.

  Vaisshnav Tej - Ketika Sharma : ‘రంగ రంగ వైభోవంగా’ నుంచి ఆకట్టుకుంటోన్న వైష్ణవ్ తేజ్, కేతిక శర్మల లుక్..


  మరోవైపు ప్రశాంత్ వర్మ.. తేజ సజ్జ (Teja sajja) హీరోగా ‘హనుమాన్’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా.  లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’. మొదటి భారతీయ సూపర్ హీరో చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. ఇప్పటికే ఈ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్’ను (Hanuman First Look) విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించించి చిత్రబృందం. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్, జయక్రిష్, హరి గౌర, కృష్ణ సౌరభ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తాజాగా  ఈ  రోజు కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతోంది.  గ్రామీణ నేపథ్యంలో ఆసక్తి కలిగించే కథా, కథనాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఓ ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే ఓ యువకుడు.. అనుకోకుండా వచ్చిన అద్భుత శక్తులతో ఎలా సూపర్ మ్యాన్‌గా మారడాడనేదే ఈ సినిమా కథాంశం. ఈ నేపథ్యంలో తన ఊరికి వచ్చిన కష్టాన్ని తన శక్తులతో ఎలా అంతం చేసాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో హీరోగా చేస్తున్న తేజా సజ్జా బాల నటుడిగా పరిచయమే.. ఆయన ఇంద్ర వంటి సినిమాల్లో నటించి అదరగొట్టారు.

  Jayaram Corona Positive : ‘అల వైకుంఠపురములో’ నటుడు జయరామ్‌కు కరోనా పాజిటివ్..

  ఇక తేజ సజ్జా నటించిన మరో చిత్రం ఇష్క్. ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా ప్రకాష్ వారియర్‌ (Priya Prakash Varrier నటించింది. ఆ తర్వాత రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్‌తో కలిసి ‘అద్భుతం’ సినిమాలో నటించారు. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Hanuman Movie, Prashanth Varma, Teja Sajja, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు