హోమ్ /వార్తలు /సినిమా /

Parari: ‘పరారి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల.. మార్చి 30 న గ్రాండ్ రిలీజ్..

Parari: ‘పరారి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల.. మార్చి 30 న గ్రాండ్ రిలీజ్..

‘పరారీ’ మూవీ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

‘పరారీ’ మూవీ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Parari Theatrical Trailer Talk : శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Parari Theatrical Trailer Talk : శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ. ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్‌కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్ లు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయగా , దర్శకులు చంద్ర మహేష్, నిర్మాత తుమ్మల పల్లి రామసత్య నారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్ లు థియేట్రికల్ ప్రోమో ను విడుదల చేశారు.నటి కవిత సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్స్ సి. హెచ్ హనుమంత రావు(మాజీ రాజ్య సభ) , గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొని చిత్ర హీరో యోగేశ్వర్ గబర్త్ డే సెలెబ్రేషన్ గ్రాండ్ గా జరిపి కేక్ కట్ చేశారు.

అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ.. తెలుగుకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలోనాగార్జున యూనివర్సిటీలో ఆర్. జీ.వి మహిళలను కించ పరచే విధంగా మాట్లాడడం కరెక్ట్ గా లేదు. తను వెంటనే మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలి. చెప్పక పొతే తనను ఇండస్ట్రీ వారందరూ తనను బహిష్కరించి చంచల్ గుడా జైలుకు పంపాలి. ఈ సినిమాలో నటించిన హీరో కు నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

నటులు సుమన్ మాట్లాడుతూ.. మనక తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా కృషి చేసిన RRR టీం కంగ్రాట్స్. ఇది మన తెలుగు వారందరూ గర్వించే రోజు.ఇలాగే మన తెలుగు వారు మంచి సినిమాలు తీసి మరిన్ని ఆస్కార్ తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంజి గారు మా సినిమాకు డి. ఓ. పి గా చేయడం చాలా హ్యాపీ.. మహిత్ లాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ లభించారు. ఇలా అందరూ మంచి టెక్నిషియన్స్ లభించడంతో సినిమా చాలా బాగా వచ్చింది.హీరో యోగేష్ చాలా బాగా నటించాడు. ఒక వైపు చదువు, మరో వైపు షూటింగ్ ఇలా కాలీ లేకుండా ఈ సినిమా కొరకు చాలా కస్టపడ్డాడు. .ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మంచి సినిమా చూశాము అనే ఫీల్ కలిగేలా కలుగుతుంది. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి వి వి గిరి మాట్లాడుతూ: మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. చక్రి తమ్ముడు మహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను సుమన్ గారి అభిమానిని. ఆయన ఈ మూవీ లో సుమన్ మంచి క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా బాగా వచ్చింది.ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మంచి కథ కథనాలతో తెరకెక్కిన పరారీ అందరిని మెప్పిస్తుందని అన్నారు.

సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ..

హీరో యోగేష్ కు జన్మదిన శుభాకాంక్షలు.తను ఇందులో బాగా నటించాడు.సుమన్ గారు మా సినిమాకు చాలా ఎఫెక్ట్ పెట్టి పని చేశారన్నారు. డి. ఓ. పి అంజి మాట్లాడుతూ.. గిరి గారు చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలో తన కొడుకు యోగీశ్వర్ చాలా బాగా నటించాడు. మహిత్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. దర్శకుడు మంచి టీం తో అనుకున్న టైంలో, బడ్జెట్ లో సినిమా పూర్తి చేశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు. చిత్ర హీరో యోగేశ్వర్ మాట్లాడుతూ..సుమన్ సార్ తో నా మెదటి సినిమాలో నటిస్తానని అనుకోలేదు. మా డి. ఓ పి అంజి గారు నన్ను బాగా చూయించారు. మంచి కథ, మంచి కామెడీ, ఫైట్స్ తో వస్తున్న ఈ సినిమా చూసిన వారందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందన్నారు.

First published:

Tags: Suman, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు