Home /News /movies /

PRANITHA SUBHASH SENSATIONAL TWEET ON UDAIPUR KILLING SAYS HINDU LIVES MATTER SB

Pranitha Subhash: ఉదయ్‌పూర్ కిల్లింగ్ పై .. హీరోయిన్ ప్రణీత సంచలన ట్వీట్..!

Photo Twitter

Photo Twitter

రాజస్థాన్‌లో కన్హయ్య లాల్ అనే టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు బాధితురాలి గొంతు కోసి, ఆపై వీడియోను సోషల్‌లో పోస్ట్ చేయడంపై పలువురు సెలబ్రిటీలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

    టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రణీత అని పిలవబడే ఈమె 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ పోర్కి సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది ప్రణీత. పోర్కి హిట్ తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో నటించిన బావ (2010) సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది. ప్రణీత పెళ్లైన సంగతి తెలిసిందే. ప్రణీత వివాహం బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో 2021 మే 30న జరిగింది.ఇటీవలే ఆమె ఆడపిల్లకు కూడా జన్మనిచ్చింది. 2022 జూన్ 10న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

    తాజాగా ప్రణీత సుభాష్ మరోసారి వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. ఈ ఘటనపై బుధవారం హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ స్పందించింది. 'హిందూ లైవ్స్‌ మ్యాటర్‌' అనే పోస్టర్‌ని చేతుల్లో పట్టుకొని ఉన్న ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంది.



    ఎవరైనా వింటున్నారా? అని కాప్షన్ లో రాసింది. సోషల్‌ మీడియాలో 'హిందూ లైవ్స్‌ మ్యాటర్‌' పేరుతో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇక దీంతో పాటు ప్రణీత మరో పోస్టు కూడా చేసింది."నేను ఉదయపూర్ వీడియోను చూడకపోతే బాగుండేది. బ్యాక్‌గ్రౌండ్‌లోని అరుపులు మన మనస్సులలో ప్రతిధ్వనిస్తాయి. చాలా కాలం పాటు మనల్ని వెంటాడతాయి. అంటూ ట్వీట్ చేసింది.

    ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, సౌత్ స్టార్ ప్రణీత సుభాష్ మరియు దర్శకుడు అశోక్ పండిట్ సహా సినీ ప్రముఖులు ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ అనే టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు బాధితురాలి గొంతు కోసి, ఆపై వీడియోను సోషల్‌లో పోస్ట్ చేయడంపై తీవ్రంగా వ్యతిరేకించారు. మీడియా వారు ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారని పేర్కొన్నారు.


    మరోవైపు ఉద‌య్‌పూర్ హ‌త్య కేసులో రాజ‌స్ధాన్ ప్ర‌భుత్వ చొర‌వ‌ను ప‌లువురు ప్ర‌శంసించార‌ని అశోక్ గెహ్లెత్ పేర్కొన్నారు. బుధ‌వారం నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్య‌క్త‌మైంద‌ని చెప్పారు. నేర‌స్తుల‌ను స‌త్వ‌ర‌మే అదుపులోకి తీసుకోవ‌డంతో పాటు అంత‌ర్జాతీయ లింకుల‌నూ వేగంగా వెలికితీయ‌గ‌లిగామ‌ని సీఎం అశోక్ గెహ్లోత్ చెప్పుకొచ్చారు. కాగా ఉద‌య్‌పూర్ హ‌త్య కేసు విచార‌ణ‌ను ఎన్ఐఏకు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్ ఉగ్ర మూక‌ల‌కు చెందిన స్లీప‌ర్ సెల్ ప‌నేన‌ని అనుమానిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Praneetha Subhash, Rajasthan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు