Pramod Kumar Producer cum Actor: చిత్రసీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2023లో జమున, విశ్వనాథ్, వాణీ జయరామ్, తారకరత్న,సతీష్ కౌశిక్ వంటి ప్రముఖులు కన్నుమూసిన విషయం మరిచిపోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌లో పబ్లిసిటీ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా, నిర్మాతగా సత్తా చాటిన ప్రమోద్ కుమార్ అనారోగ్యంతో (21/3/2023)న కన్నుమూసారు. ఆయన వయసు 87 ఏళ్లు. ప్రమోద్ కుమార్ టాలీవుడ్‌లో పబ్లిసిటీ డిజైనర్‌గా 38 ఏళ్లుగా పనిచేసారు. ఆయన పబ్లిసిటీ ఇంఛార్జ్‌గా పనిచేసిన 300 చిత్రాల్లో 50కి పైగా శతదినోత్సవాలు జరుపుకోవడం విశేషం. అటు నిర్మాతగా రెండు చిత్రాలను నిర్మించారు. మోహన్ బాబుతో ‘గరం మసాలా’, దొంగ పోలీస్’ చిత్రాలను నిర్మించారు. ఇక ఈయన ‘సుబ్బయ్య గారి మేడ’ చారిత్రక నవల రాశారు.
అంతేకాదు ఈయనలో మంచి రచయతగా కూడా ఉన్నాడు. ఈయన సినీ రంగంలో అనుభవాలను మేలవించి ‘తెర వెనక తెలుగు సినిమా’ పేరుతో గ్రంథస్థం చేవారు. ఈ సినిమా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నంది పురస్కారానికి ఎంపికైంది.
ఈయన మృతిపై టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mohan Babu, Telugu Cinema, Tollywood