news18-telugu
Updated: August 25, 2019, 2:45 PM IST
ఫ్రకాశ్ రాజ్(ఫైల్ ఫోటో)
దక్షిణాదిలో విలక్షణమైన పాత్రలతో సలక్షణమైన అభినయాన్ని ప్రదర్శిస్తూ తనకు తనే సాటి అనిపించుకున్న నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. తాజాగా ఈ విలక్షణ నటుడు తాజాగా న్యాయపరమైన సమస్యలో ఇరుక్కున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాష్ రాజ్.. గతంలో ‘ఉలవచారు బిర్యానీ’చిత్రాన్ని తన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని నమోదు చేయలేదు. ఐనా.. ఈ సినిమాను హిందీలో నానా పాటేకర్,తాప్సీ, అలీ ఫజల్ వంటి వాళ్లతో ‘తడ్కా’ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు ఈ రీమేక్ సంగతి అతీగతీ లేదు. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఏర్పడ్డ్ ఆర్ధిక సమస్యల కారణంగా ఆయనకు ఇపుడు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమాను నిర్మిస్తున్న ఎస్సెల్ విజన్, జీ గ్రూప్ కంపెనీలు ఒప్పందం ప్రకారం ప్రకాష్ రాజ్ తమకు చెల్లించాల్సిన రూ.5.88 కోట్లను చెల్లించలేదని కోర్డుకెక్కాయి. ఐతే.. పరిస్థితులు చేయి దాటక ముందే ప్రకాష్ రాజ్..తనపై కోర్టులో కేసు వేసిన సంస్థలకు రూ. 2 కోట్ల చెక్కుతోొ పాటు తన ఆస్ధికి సంబంధించిన పేపర్స్ తనఖా పెట్టారు. దీంతో కోర్టు ప్రకాష్ రాజ్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు టైమ్ ఇచ్చింది. ఈ లోపు ఆయనిచ్చిన రూ.2 కోట్ల రూపాయల చెక్‌తో పాటు మిగిలిన అమౌంట్ క్లియర్ చేయాలని ఆదేశించింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 25, 2019, 2:45 PM IST