PRAKASH RAJ WALK OUT BALAKRISHNA KS RAVIKUMAR MOVIE SHOOTING SPOT HERE ARE THE DETAILS TA
బాలకృష్ణ మూవీ షూటింగ్ స్పాట్లో ప్రకాష్ రాజ్ వీరంగం.. ఇంతకీ ఏం జరిగిందంటే..
బాలకృష్ణ, ప్రకాష్ రాజ్ (Facebook/Photo)
సౌత్‌లో విలక్షణ నటుడిగా ఎటువంటి పాత్రనైనా ప్రాణం పెట్టి చేసే నటుడిగా ప్రకాష్ రాజ్‌కు సెపరేట్ ప్లేస్ ఉంది. తాజాగా ప్రకాష్ రాజ్..బాలయ్య సినిమా షూటింగ్ స్పాట్లో గొడవకు దిగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
సౌత్‌లో విలక్షణ నటుడిగా ఎటువంటి పాత్రనైనా ప్రాణం పెట్టి చేసే నటుడిగా ప్రకాష్ రాజ్‌కు సెపరేట్ ప్లేస్ ఉంది. మోనార్క్ వంటి తండ్రైనా.. బొమ్మరిల్లు వంటి ఫాదరైనా.. దూకుడు వంటి నాన్న పాత్ర అయినా.. పోకిరి వంటి విలన్ పాత్రైనా ప్రకాష్ రాజ్ ముందు సలామ్ చేయాల్సిందే. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్.. అపుడపుడు తన బిహేవియర్‌తో షూటింగ్స్ నుండి వాకౌట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. దీంతో కొంత మంది దర్శక నిర్మాతలు ప్రకాష్ రాజ్‌ను సినిమాల నుండి తొలిగించిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వాస్తవాలను తెలుసుకొని రాజీ పడి సినిమా షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. తాజాగా ప్రకాష్ రాజ్.. బాలకృష్ణ హీరోగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రూలర్’ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్లో ప్రకాష్ రాజ్ కాస్త ఆవేశపడినట్టు సమాచారం.
బాలకృష్ణ,ప్రకాష్ రాజ్ (Facebook/Photo)
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్లో ప్రకాష్ రాజ్.. బాలకృష్ణ, భూమికలతో ఒక సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో.. భూమిక తన పాత్రను సరిగా చేయకపోవడంతో ఆమెపై ప్రకాష్ రాజ్ గట్టిగా అరిచినట్టు సమాచారం. దీంతో షాక్‌కు గురైన కెమెరా మెన్ రామ్ ప్రసాద్.. షూటింగ్ స్పాట్ ‘నీ ఇల్లు కాదు’ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి అని గట్టిగా సమాధానం ఇచ్చాడట. దీంతో ప్రకాష్ రాజ్ మరింత ఆవేశంగా సినిమా షూటింగ్ స్పాట్ నుండి నిష్క్రమించినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే.. ప్రకాష్ రాజ్‌ను షూటింగ్ స్పాట్లో బాలకృష్ణ సహ ఎవరు ఆయన్ని బతిమాలిక పోవడంతో ప్రకాష్ రాజ్ తనకోపం తగ్గించుకొని తిరిగి షూటింగ్ వచ్చినట్టు సమాచారం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.