Prakash Raj : ప్రకాష్ రాజ్ సర్జరీ విజయవంతం.. ది డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్..

Prakash Raj Photo : Instagram

Prakash Raj : ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే.

 • Share this:
  ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఇటీవల ఓ తమిళ షూటింగ్ సందర్భంగా ఫ్లోర్ పై జారిపడ్డారు. దీంతో ఆయన భుజానికి గాయం అయ్యింది. ఇదే విషయాన్ని ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియాలో తెలుపుతూ.. తనకు చిన్న ఫ్రాక్చర్ అయిందని, తన మిత్రుడు డాక్టర్ గురువారెడ్డితో సర్జరీ చేయించుకునేందుకు హైదరాబాద్‌కు వస్తున్నానని ట్వీట్ చేశారు. ఇక తాజాగా తనకు సర్జరీ విజయవంతంగా పూర్తి అయ్యిందని తెలిపారు ప్రకాష్ రాజ్. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తూ.. ఓ ఫోటోను కూడా పంచుకున్నారు. తనకు సర్జరీ చేసిన డాక్టర్ గురువారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. త్వరలోనే మళ్లీ యాక్షన్ లోకి వస్తానని చెప్పారు. 'ది డెవిల్ ఈజ్ బ్యాక్' అంటూ ట్వీట్ చేశారు. ఇక అది అలా ఉంటే ఆయన సినిమాల్లో నటిస్తూనే.. మా ప్రెసిడెంట్ (MAA Elections) పోటీలో ఉన్నారు. ఈ మా ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగాల్సిఉంది. మా ఎన్నికల్లో అధ్యక్ష ప‌ద‌వి కోసం ప్రకాష్ రాజ్‌‌తో పాటు హీరో మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, నటి హేమ పోటిలో ఉన్నారు. దీంతో మా ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని తెలుస్తోంది.

  ప్ర‌కాష్ రాజ్‌ ప్యానల్‌లో జ‌య‌సుధ‌, శ్రీకాంత్, బెన‌ర్జీ, సాయికుమార్, త‌నీష్, ప్ర‌గ‌తి, అన‌సూయ‌, స‌న‌, అనితా చౌద‌రి, సుధ‌, అజ‌య్, నాగినీడు, బ్ర‌హ్మాజీ, ర‌విప్ర‌కాష్, స‌మీర్‌, ఉత్తేజ్‌, బండ్ల గ‌ణేష్, ఏడిద శ్రీరామ్‌, శివారెడ్డి, భూపాల్, టార్జాన్‌, సురేష్ కొండేటి, ఖ‌య్యూమ్‌, సుడిగాలి సుధీర్‌, గోవింద‌రావు, శ్రీధ‌ర్ రావు ఉన్నారు. ఇక ఈ పోటీలో ఉన్న నటి ఇటీవల మా ప్రెసిడెంట్ నరేష్ విషయంలో కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..  దీంతో నరేష్ క్రమ శిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు.


  ఇదే విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. అందులో భాగంగా ఆయన మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు నటుడు నిర్మాత కృష్ణంరాజుకు లేఖ రాశారు. ఈ ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎలక్షన్స్ ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని తన లేఖలో పేర్కోన్నారు. మా ఎలక్షన్స్‌లో పాల్గొంటున్న సభ్యుల ప్రవర్తన తీరుకారణంగా అసోసియేషన్ ప్రతిష్ట మసకబారుతోందని.. ఈ విషయంలో అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేవారి విషయంలో సరైన చర్యలు తీసుకోవాలనీ చిరంజీవి తన లేఖలో స్పష్టం చేశారు. ఇక మరోవైపు చిరంజీవి లేఖ రాసిన 24గంటల్లోనే ఆయన బాటలో 113 మంది మా సభ్యులు కృష్ణంరాజుకు లేఖలు రాశారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన్ను కోరారు.

  ఇవి కూడా చూడండి :

  Balakrishna | Akhanda : ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ అఖండ.. సంక్రాంతి బరిలో ఖాయం..

  Poorna : పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

  RRR : అర్ధనగ్నంగా పోజులిచ్చిన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఆలియా భట్.. పిక్స్ వైరల్..

  Anchor Varshini : బికినీలో యాంకర్ వర్షిణి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

  Premi Viswanath : బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెరిసిపోతున్న వంటలక్క...

  Anchor Vishnupriya : లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..
  Published by:Suresh Rachamalla
  First published: