Nagababu Vs Prakash Raj: నాగబాబు రిప్లైకు ప్రకాష్ రాజ్ గట్టి కౌంటర్.. గ్రేటర్ ఎన్నికల వేళ మాటల యుద్ధం..

ముఖ్యంగా గత రెండు పర్యాయాలుగా చూస్తే ఆ సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ఇవి కూడా మెయిన్ ఎలక్షన్స్ అయిపోయాయి. అందులోనూ ఒకరినొకరు తిట్టుకోవడాలు.. అరుచుకోవడాలు చేస్తున్నారు. కుదిర్తే కొట్టేలా కూడా కనిపిస్తున్నారు.

Nagababu Vs Prakash Raj | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల మధ్యే కాకుండా... సినీ నటుల మధ్య మాటల యుద్ధానకిి తెర లేపింది. తాజాగా నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ పై గట్టి రిప్లై ఇచ్చాడు.

  • Share this:
    Nagababu Vs Prakash Raj | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల మధ్యే కాకుండా... సినీ నటుల మధ్య మాటల యుద్ధానకిి తెర లేపింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల పోరు పెరుగుతోంది. హైదరాబాద్ మహానగర పాలికకు జరుగుతున్న ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ప్రకాష్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రంలో ఉన్న బీజేపీతో పాటు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (pawan kalyan) వైఖరిని ఆయన తప్పుబడుతూ... ఆయనో రాజకీయ ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యానించాడు. దానికి జనసేనాని అన్నయ్య నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చాడు. నువ్వో కు సంస్కారివి. దర్శకులను కాక పట్టి నిర్మాతలను పీడించుకుతినే నువ్వా మాకు చెప్పేది అంటూనే కాస్త ఘాటునే ప్రకాష్ రాజ్‌కు రిప్లై ఇచ్చాడు. అంతేకాదు బీజేపీ నాయకత్వాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నువ్వు నోటికొచ్చినట్టు ఎంత విమర్శించినా.. నిన్ను ఎవరు ఏమి అనలేదంటే అది బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ అని అర్ధం చేసుకో ప్రకాష్ రాజ్‌కు ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు.

    తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్‌కు ప్రకాష్ రాజ్ తెలుగులో ట్వీట్ చేసి మరి గట్టి రిప్లై ఇచ్చాడు.గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు ఫవన్ కళ్యాన్  మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు అంటూ కాస్త వ్యంగ్యంగా  చేతులు జోడిస్తున్న ఎమోజీలను పోస్ట్ చేస్తూ  నాగబాబుకు తన ట్వీట్‌తో రిప్లై ఇచ్చాడు.


    మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇపుడు సినీ ఇండస్ట్రీలోని నటుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: