మామిడికాయలు అమ్ముతున్న ప్రకాష్ రాజ్ కుమారుడు..

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నాలుగేళ్ల కుమారుడు మామిడికాయలు అమ్ముతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: April 27, 2020, 1:55 PM IST
మామిడికాయలు అమ్ముతున్న ప్రకాష్ రాజ్ కుమారుడు..
ప్రకాష్ రాజ్ Photo : Twitter
  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాయి. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా రోజువారి కూలీ పనులు చేసుకునే జీవితాన్ని కొనసాగిస్తున్న జనాలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. ఈ క్రమంలో సమాజం పట్ల సోయి.. సామాజిక సృహ ఉన్నవారు ఆర్థికంగా అంతో ఇంతో స్థోమత ఉన్నవారు తోటి మనుషులకు తోడుగా నిలుస్తూ.. వలస కూలీలకు అండగా వస్తు రూపంలో గానీ, డబ్బు రూపంలోగానీ సాయం చేస్తున్నారు. కుదిరితే ఆహారాన్ని కూడా పంచుతున్నారు. ఆ కోవలోకి వస్తాడు నటుడు ప్రకాష్ రాజ్. ఆయన తన స్థోమతకు తగ్గట్లుగా చుట్టు పక్కల ఉన్న జనాలకు సాయం చేస్తూ ఈ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నాడు. మరోవైపు ప్రకాష్ రాజ్ ఈ లాక్ డౌన్ కాలంలో భార్యాపిల్లలతో తన ఫామ్ హైజ్ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

అది అలా ఉంటే ప్రకాష్ రాజ్ తన ఫామ్ హౌజ్‌లో పండిన మామిడికాయలను అమ్ముతున్నాడు. ఈ అమ్మకంలో ఆయన నాలుగేళ్ల కుమారుడు తోడుగా ఉన్నాడని.. తన కుమారుడు తన తోటలో పండిన మామిడికాయలను అమ్ముతూ.. ప్రకృతిలో ఒడిలో ఒదిగిపోయాడని పేర్కోన్నాడు. దీనికి సంబందించిన ఓ ఫోటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక ప్రకాష్ రాజ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగ మార్తండలో నటిస్తున్నాడు.


Published by: Suresh Rachamalla
First published: April 27, 2020, 1:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading