Prakash Raj : కంగనాపై ప్రకాశ్‌రాజ్ సెటైర్లు

Prakash Raj : కంగనాపై ప్రకాశ్‌రాజ్ సెటైర్లు

కంగనా రనౌత్, ప్రకాశ్‌రాజ్(Prakash Raj, kangana Ranaut)

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రకాశ్‌రాజ్.. #justasking పేరుతో వర్తమాన అంశాలపై పోస్టులు చేస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కంగనాపై తనదైశ శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 • Share this:
  బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రకాశ్‌రాజ్.. #justasking పేరుతో వర్తమాన అంశాలపై పోస్టులు చేస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కంగనాపై తనదైశ శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక్క సినిమాతో కంగనా.. తనను తాను రాణి లక్ష్మీ బాయి అని అనుకుంటే.. అప్పుడు దీపికా పడుకొనే -పద్మావతి, హృతిక్ రోషన్- అక్బర్, షారుఖ్‌ ఖాన్-అశోక, అజయ్ దేవ్‌గన్- భగత్ సింగ్, అమీర్ ఖాన్-మంగల్ పాండే, వివేక్ ఒబేరాయ్- మోదీ.. వీళ్లు కూడా అలానే ఆలోచించాలా అనే అర్థం వచ్చేలా ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఫొటోను కూడా ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు.  ఇక, కంగనా సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం అనంతరం ఆమె మరింత దూకుడు పెంచారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటుగా పలువురు బాలీవుడు ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వంపై ఆమె విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. కంగనా ఇల్లు కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నిర్ణయంపై కంగనై బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు