బాలయ్య చేసింది కరెక్ట్ కాదు.. చిరును వెనకేసుకొచ్చిన ప్రకాష్ రాజ్..

బాలకృష్ణ,చిరంజీవి ఇష్యూపై ప్రకాష్ రాజ్ స్పందన (File/Photos)

రీసెంట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో జరిపిన చర్చల విషయమై తనను పిలవలేదని చెప్పి పెద్ద సంచలనమే క్రియేట్ చేసారు బాలకృష్ణ. తాజాగా ఈ ఇష్యూపై ప్రకాష్ రాజ్ స్పందించారు.

 • Share this:
  రీసెంట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో జరిపిన చర్చల విషయమై తనను పిలవలేదని చెప్పి పెద్ద సంచలనమే క్రియేట్ చేసారు బాలకృష్ణ. ఈ సంఘటనతో టాలీవుడ్‌లో ఐక్యత అనేది లేదని ఇండస్ట్రీలో రెండు గ్రూపులున్నాయన్న సంగతి మరోసారి స్పష్టం అయింది. సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వంలో భూముల పందేరం కోసమే ఈ సమావేశం అయినట్టు బాలయ్య చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య మాటలకు నాగబాబు కౌంటర్ ఇవ్వడం.. దానికి ప్రతిగా బాలయ్య అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా నాగబాబును ఏకి పారేయడం.. ఇటు మెగాభిమానులు కూడా బాలయ్యపై సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోయడం అన్ని అయ్యాయి. ఈ టాపిక్  బాలయ్య వర్సెస్ చిరంజీవిగా మారింది.  తాజాగా ఈ ఇష్యూపై ప్రకాష్ రాజ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. నాకు బాలయ్య బాబు తెలుసు. అలాగే చిరంజీవి కూడా తెలుసు. ఈ వివాదం విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా సినిమాకు సంబంధించిన బాగోగులు చూస్తున్నారు.

  prakash raj responds on balakrishna chiranjeevi issue,balakrishna,chiranjeevi,balakrishna vs chiranjeevi,nagababu,balayya,balayya vs nagababu,balayya vs chiranjeevi,balakrishna prakash raj chiranjeevi,prakash raj respond on balakrishna chiranjeevi issue,prakash raj twitter,chiranjeevi twitter,balakrishna twitter,tollywood,telugu cinema,బాలకృష్ణ,చిరంజీవి,నాగబాబు,బాలయ్య,బాలకృష్ణ వర్సెస్ ప్రకాష్ రాజ్,బాలయ్య వర్సెస్ ప్రకాష్ రాజ్,బాలయ్య వర్సెస్ చిరంజీవి,బాలయ్య వర్సెస్ నాగబాబు,బాలయ్య చిరంజీవి ఇష్యూపై ప్రకాష్ రాజ్ స్పందన
  బాలయ్య, చిరంజీవి (balakrishna chiranjeevi)


  ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది ప్రొడ్యూసర్స్, నిర్మాతలు చిరంజీవితో కూర్చొని మాట్లాడరు. అందులో పెద్ద విషయం ఉందని నేను అనుకోవడం లేదు. దానికి నన్ను నన్ను పిలవలేదు. మిమ్మల్ని పిలవలేదని చెప్పడం కరెక్ట్ కాదని ఇన్‌డైరెక్ట్‌గా బాలయ్యకు చురకలు అంటించారు. చిరంజీవికి పెద్దరికం ఉంది. ఇండస్ట్రీకి ఇపుడున్న పెద్ద దిక్కు ఆయనే అంటూ చెప్పుకొచ్చారు. వాళ్లు మాట్లాడటం అయిన తర్వాత ఏదైనా అవసరం అనుకుంటే పిలుస్తారు. ప్రతి మీటింగ్‌కు అందరూ వెళ్లాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. బాలయ్య బాబుకు పెద్ద మాట చెప్పడం కాదు కాని.. నా కైతే పిలవనందకు ఎలాంటి ప్రాబ్లెమ్స్ లేవు. చిరంజీవి ఇంట్లో నలుగురు ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని సమస్య పరిష్కారం గురించి ఆలోచించారు. తరువాత పిలుపు వరకు బాలయ్య వేచి ఉంటే బాగుండేదన్నారు. ఇండస్ట్రీలో ఈగోలు తప్పు. ఇలాంటి వాటిని మీడియా కూడా పెద్దవిగా చూపించడం కూడా తప్పే అన్నారు. మీడియా కూడా ఇలాంటి వాటిపై ఫోకస్ చేయడం తగ్గిస్తే బాగుంటుదన్నారు.  ప్రకాష్ రాజ్ మాట్లాడిన విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య అభిమానులు అయితే.. మా హీరోకు పెద్దరికం లేదా. .. ఆయన కూడా పెద్ద స్టార్. ఆయన లేకుండా మీటింగులు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మెగాభిమానులు మాత్రం ప్రకాష్ రాజ్ చెప్పింది కరెక్టే కదా అంటున్నారు. మొత్తానికి ప్రకాష్ రాజ్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో చిచ్చు పెట్టేలా ఉన్నాయన్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: