ప్రకాష్ రాజ్ పెద్ద మనసు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న అభిమానులు..

ప్రకాష్ రాజ్ (Twitter/Photo)

తెలుగు, తమిళంతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో విలక్షణ నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు ప్రకాష్ రాజ్. తాజాగా ఈయన చేసిన పనికి అందరు మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే...

  • Share this:
    తెలుగు, తమిళంతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో విలక్షణ నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు ప్రకాష్ రాజ్. తాజాగా ఈయన చేసిన పనికి అందరు మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఎవరి ఇళ్లకు వాళ్లు పరిమితమయ్యారు. తాజాగా ప్రకాష్ రాజ్.. తన ఇంట్లో పనిచేసే వాళ్లకు, వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకు ఇవ్వాల్సిన జీత భత్యాలను ముందు చెల్లించేసారు ప్రకాష్ రాజ్. దేశంలో కరోనా రక్కసి విలయ తాండవం చేస్తోన్న ఈ సమయంలో ఇప్పటికే షూటింగ్స్ సహా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను సైతం రద్దు చేసి తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్స్ రద్దు కారణంగా చాలా మంది నటీనటులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆయా సినిమాల కోసం పనిచేసే చాలా మందికి పనుల్లేక ఆర్దికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ .. తన దగ్గర పనిచేసే వాళ్లందరకీ మే నెల వరకు జీతాలను ముందే ఇచ్చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక నేను చేసే సినిమాల కోసం పనిచేస్తోన్న రోజు వారి పనివారికి కనీసం సగం జీతాలైన అందించాలనే ఆలోచనలో ఉన్నానన్నారు. నాకు ఎంత వరకు వీలైతే అంత వరకు సాయం చేస్తాను. మీరు కూడా మీకు వీలైంత వరకు సాయం చేయండి. ఒకరి కోసం మరొకరు సాయం చేయాల్సిన సమయమిది అని ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా అందిరికీ విజ్ఞప్తి చేసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: